Drugs: త్రిపురలో రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

డ్రగ్స్ నివారణకు పోలీసులు, సంబంధిత అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. యధావిధిగా అమ్మకాలు జరుగుతున్నాయి. సినిమా స్టైలో, ఇతర మార్గాల్లో డ్రగ్స్ ను సప్లయ్ చేస్తూ కావాల్సిన వాళ్లకు చేరవేస్తున్నారు. అయితే ఇటీవల పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో దళారులు పోలీసులకు చిక్కుతున్నారు.

Drugs: త్రిపురలో రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
Drugs

Updated on: Mar 10, 2024 | 8:57 PM

డ్రగ్స్ నివారణకు పోలీసులు, సంబంధిత అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. యధావిధిగా అమ్మకాలు జరుగుతున్నాయి. సినిమా స్టైలో, ఇతర మార్గాల్లో డ్రగ్స్ ను సప్లయ్ చేస్తూ కావాల్సిన వాళ్లకు చేరవేస్తున్నారు. అయితే ఇటీవల పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో దళారులు పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా ఉత్తర త్రిపురలోని బాగ్బాసా నాకా పాయింట్ సమీపంలో అగర్తలా వెళ్లే వాహనం నుంచి రూ.5 కోట్ల విలువైన 55,000 మెథాంఫేటమిన్ మాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకొని ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు త్రిపుర-అస్సాం అంతర్రాష్ట్ర సరిహద్దులోని బాగ్బాసా వద్ద ఒక వాహనాన్ని అడ్డగించి చెక్ చేయగా,  స్థానికంగా యాబా టాబ్లెట్ లేదా పార్టీ టాబ్లెట్ అని కూడా పిలువబడే మాత్రలు దొరికాయని ఉత్తర త్రిపుర జిల్లా పోలీసు సూపరింటెండెంట్ భానుపాద చక్రవర్తి తెలిపారు.

మయన్మార్ నుంచి స్మగ్లింగ్ చేసిన డ్రగ్స్ మిజోరం, అస్సాం రాష్ట్రాల మీదుగా త్రిపురలోకి ప్రవేశించాయి. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నవారిని విచారిస్తున్నాం. అరెస్టయిన డ్రగ్ పెడ్లర్లు దక్షిణ అస్సాంలోని కరీంగంజ్ కు చెందినవారు’ అని చక్రవర్తి తెలిపారు. మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంలో పోలీసుల పాత్రను ప్రశంసించింది త్రిపుర హోంశాఖ. ఈ సందర్భంగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా రియాక్ట్ అవుతూ “నషా ముక్త్ భారత్ ను నిర్మించాలనే మా దార్శనికతలో త్రిపుర పోలీసుల పాత్ర ప్రశంసనీయం” అని అన్నారు.

మయన్మార్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న మెథాంఫేటమిన్ మాత్రలు ఇటీవలి కాలంలో ఎక్కువగా అక్రమ రవాణాకు గురవుతున్న మాదక ద్రవ్యాల్లో ఒకటి. ఈ మందులకు ఈశాన్య రాష్ట్రాలు, భారతదేశంలోని ఇతర ప్రాంతాలు, పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో భారీ డిమాండ్ ఉంది. త్రిపురలోని ఉనకోటి జిల్లా రాధానగర్ లో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా అస్సాం రైఫిల్స్ ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతేకాదు వరుస సోదాలు చేస్తూ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు.