Gujarat Drug Bust: గుజరాత్ రాష్ట్రంలో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. భరూచ్ ప్రాంతంలోని అంకలేశ్వర్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు. దాదాపు 513 కేజీల డ్రగ్స్ ఈ సోదాల్లో పట్టుబడ్డాయి. దీని విలువ రూ.1,026 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వాళ్లలో ఓ మహిళ కూడా ఉంది. కాగా, ఓ ఫ్యాక్టరీలో ఎండీ డ్రగ్స్ తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో బస్తాల కొద్ది డ్రగ్స్ పట్టుబడ్డాయి. కాగా, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ గుజరాత్‌లో వేల కోట్ల విలువ చేసే భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..