ముంబైలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. శనివారం ఉదయం అమెరికా నుంచి వచ్చిన ఓ కొరియర్‌ను చెక్ చేసిన అధికారులు ఖంగుతిన్నారు. అందులో 27 కేజీల మాదకద్రవ్యాలను అధికారులు గుర్తించారు. ఆ డ్రగ్.. హై-క్వాలిటీ హైడ్రోపోనిక్స్ గంజాయిగా గుర్తించారు. కొరియర్ లో వచ్చిన ఫర్నిచర్‌లో డ్రగ్స్ ను దాచి తీసుకొచ్చిన నిందితులని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అసలు ఆ కొరియర్‌ను ఎవరు పంపారు.. ఎక్కడికి పంపారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఉత్తర అమెరికా మూలానికి చెందిన ఇటువంటి అధిక-నాణ్యత గల గంజాయి విలువ స్థానిక అక్రమ మార్కెట్‌లలో గ్రాముకు రూ. 3,000 కంటే ఎక్కువ ధర పలుకుతుందని అధికారులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 8 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని చెప్పారు. ప్యాకేజీ తీసుకునేందుకు వచ్చిన వ్యక్తి ఈ ఆపరేషన్‌కు సూత్రధారిగా తేలింది. అతని నివాసంలో సోదాలు నిర్వహించగా, మరో 20 కిలోల గంజాయి, 120 గ్రాముల హషీష్.. మరికొన్ని మాదక ద్రవ్యాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ డ్రగ్ రాకెట్‌తో సంబంధం ఉన్న మరో వ్యక్తి కోసం అధికారులు గాలిస్తున్నారు. కాగా డ్రగ్స్ అక్రమ రవాణాను భగ్నం చేసిన కస్టమ్స్ అధికారులను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. “డ్రగ్స్ ముప్పును నివారించడానికి అప్రమత్తంగా ఉండండి! వెల్ డన్” అని ఆమె ట్వీట్ చేశారు.
Being alert to prevent the drug menace! Well done @mumbaicus3 @cbic_india @FinMinIndia https://t.co/05GYGHyy7A
— Nirmala Sitharaman (@nsitharaman) April 30, 2022
Also Read: Viral: రైతు పొలం దున్నుతుండగా బయటపడిన అద్భుతం.. ఆనందంలో అన్నదాత
Telugu Bigg Boss: తెలుగు బిగ్ బాస్ షో ఆగిపోతుందా..? కీలక కామెంట్స్ చేసిన ఏపీ హైకోర్టు