రోడ్డు మార్గం అయిపోయింది.. వాయి మార్గం అయిపోయింది. ఇప్పుడు జల మార్గంపై మనసు మళ్లింది. ఇంక దేనికండీ బాబు.. డ్రగ్స్ రవాణాకు. రోడ్డు మార్గంలో పోలీసులు స్పెషల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మరీ.. స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. కేటుగాళ్లు ఎన్ని కొత్త మార్గాలు అన్వేశిస్తున్నా.. ఖాకీలు వారి కథలకు పుల్ స్టాప్ పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో పార్శిల్స్ రూపంలో కార్గో విమానాల్లో డ్రగ్స్ ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని చూసి.. చాలామంది స్మగ్లర్లు బుక్కయ్యారు. దీంతో జలమార్గంపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ కూడా వారి పప్పులు ఉడకలేదు. తాజాగా తమిళనాడు.. ఆరేబియా మహాసముద్రంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. లక్షదీవుల సమీపంలో తమిళనాడు జాలర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో కోస్ట్ గార్డ్‌లతో కలిసి DRI (Directorate of Revenue Intelligence) అధికారులు… ‘ఆపరేషన్ ఖోజ్‌బీన్'(Operation Khojbeen) పేరుతో జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ దాడుల్లో మైండ్ బ్లాంక్ అయ్యే డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. 2 బోటులలో సుమారు 15 వందల కోట్ల విలువైన 218 కేజీల హైగ్రేడ్ హెరాయిన్‌ని గుర్తించారు అధికారులు. తమిళనాడుకి చెందిన జాలర్లను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు అధికారులు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారు. వెనుక ఎవరి హస్తం ఉంది అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
An operation was launched by DRI after it developed specific intelligence over a period of several months that 2 Indian boats would be sailing from coast of Tamil Nadu and receive narcotics in huge quantity somewhere in Arabian sea, during the second/third week of May 2022: DRI pic.twitter.com/lXNl18NIEm
— ANI (@ANI) May 20, 2022
కాగా డ్రగ్స్ విషయంలో సీరియస్‌గా ఉండాలని పోలీసులతో పాటు పలు ప్రభుత్వ ఏజెన్సీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కఠిన ఆదేశాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రగ్స్ భారీ ఎత్తున పట్టుబడుతున్న ఘటనలు తరచూ గమనిస్తూనే ఉన్నాం.