
అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంటుంది. డ్రగ్స్ వల్ల ఇప్పటికే ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అయినా మత్తు పదార్థాలను మాత్రం వదలడం లేదు. ఈ డ్రగ్స్ వల్ల ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. అందుకే అధికారులు వీటిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా బెంగళూరు ఎయిర్ పోర్టులో రూ.40 కోట్ల విలువైన 4 కిలోల కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రయాణికుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
బెంగళూరు ఎయిర్ పోర్టులో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దోహా నుండి వచ్చిన ఓ వ్యక్తి వద్ద రెండు సూపర్ హీరో కామిక్స్ బుక్స్ ఉండడాన్ని గుర్తించారు. అయితే అవి మాములు బుక్స్ కన్నా బాగా బరువు ఉండడంతో అధికారులు డౌట్ వచ్చింది. వెంటనే చెక్ చేయగా.. బుక్స్‌లో తెల్లటి పొడి ఉన్నట్లు గుర్తించారు. అందులో కొకైన్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. 4 కిలోలు ఉన్న కొకైన్ విలువ మార్కెట్‌లో రూ.40 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..