Vaccine Sputnik V: కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ని భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్.. భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కి దరఖాస్తు చేసేందుకు సిధ్ధమైంది. ఈ విషయాన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ శుక్రవారం నాడు వెల్లడించింది. రష్యా తయారు చేసిన ఈ ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ ఇప్పటికే మానవాధిరిత ట్రయల్స్ అన్నీ పూర్తి చేసుకుందని, ఈ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. కాగా, ‘స్పుత్నిక్ వి’ టీకా 91.6 శాతం మేరకు ప్రభావవంతంగా ఉందని గతంలో లాన్సెట్ జర్నల్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి మరికొద్ది రోజుల్లో అనుమతి లభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ‘స్పుత్నిక్ వి’ గనుక అందుబాటులోకి వస్తే భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు వినియోగంలోకి వచ్చిన మూడవ టీకాగా నిలవనుంది.
Also read:
Uttar Pradesh Accident : పెళ్లి కోసం సంతోషంగా ఊరేగింపుగా వెళ్తోన్న వధువు.. అంతలోనే విషాద ఘటన