
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంత జిల్లా కలబురిగి జిల్లాలో నిన్న ప్రధాని రోడ్ షో నిర్వహించారు. అయితే దీనికి ముందు అక్కడున్న కొంతమంది చిన్నారులను ఆయన కలిశారు. ప్రధానిని చూసిన చిన్నారులు ఆనందంతో కేకలు వేశారు. ఈ సందర్భంగా ఆయన వారితో సరదాగా ముచ్చటించారు.
ఆయన తన చేతి వేళ్ల ఆకృతిని మారుస్తూ అక్కడున్న పిల్లల్ని అలా చేయమని అడిగారు. వాళ్లు ఆయన చేసిన లాగే చేశారు. ఆ తర్వాత మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారని ఆ చిన్నారుల్ని ప్రశ్నించారు. ఒకరు డాక్టర్ అవుతానంటూ, మరొకరు పోలీస్ అవుతానంటూ సమాధానం చెప్పారు. అయితే దానికి ప్రధాని మీలో ఎవరూ ప్రధాని కావాలనుకోవడం లేదా అంటూ అడిగారు. దానికి ఓ చిన్నారి నాకు మీలా అవ్వాలనుందంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ಮುಗ್ಧ ಮಕ್ಕಳಿಗೂ ಮೋದಿ ಜೀ ಎಂದರೆ ಅಚ್ಚುಮೆಚ್ಚು…
ಕಲಬುರಗಿಯಲ್ಲಿ ಮಕ್ಕಳೊಂದಿಗೆ ಪ್ರಧಾನಿ ಶ್ರೀ @narendramodi#KannadigasWithModi #PoornaBahumata4BJP #BJPWinningKarnataka #DoubleEngineSarkara #BJPYeBharavase pic.twitter.com/oiAdeCNV20
— BJP Karnataka (@BJP4Karnataka) May 2, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..