యూపీ పోలీసులను, బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మలేం.. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్య

| Edited By: Phani CH

Jul 12, 2021 | 9:32 PM

యూపీ పోలీసులను,ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని తాను నమ్మలేనని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. పోలీసుల ప్రకటనలు సందేహాస్పదంగా ఉన్నాయన్నారు.

యూపీ పోలీసులను, బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మలేం.. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్య
Akhilesh Yadav
Follow us on

యూపీ పోలీసులను,ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని తాను నమ్మలేనని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. పోలీసుల ప్రకటనలు సందేహాస్పదంగా ఉన్నాయన్నారు. యూపీలో ఇద్దరు టెర్రరిస్టులను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఆల్-ఖైదాకు అనుబంధంగా ఉన్న గజ్ వతుల్ హింద్ సంస్థకు చెందిన ఈ ఉగ్రవాదులను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసింది. వీరి వద్ద అనుమానాస్పద డాక్యుమెంట్లను, ప్రెషర్ కుకర్ బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. కానీ ఈ ప్రకటన తనకు నమ్మదగినదిగా కనిపించడం లేదని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇదే సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా ఇలాగే అనుమానాలను వ్యక్తం చేశారు. అఖిలేష్ వ్యాఖ్యలతో దాదాపు ఏకీభవిస్తున్నట్టే ఆమె కూడా స్పందించారు. ఈ టెర్రరిస్టులను పట్టుకున్నట్టు పోలీసులు చెబుతున్నారని.. ఇది నిజమే అయితే చాలా తీవ్రమైన విషయమని ఆమె అన్నారు.

దీనిపై రాజకీయాలు తగవన్నారు. ఇది చాలా సీరియస్.. ప్రభుత్వం వెంటనే దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలి.. దీని మాటున రాజకీయాలు రేగడం సరికాదు అని మాయావతి పేర్కొన్నారు. ఈ విధమైన యాక్షన్ (నటన) ప్రజల మనస్సులో అనుమానాలు లేవనెత్తుతుందని..అసలే యూపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఆమె అన్నారు. ఇందులో నిజమే ఉంటే పోలీసులు ఉదాసీనంగా ఎందుకు ఉన్నారని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడే ఈ విధమైన పరిస్థితి ఉన్న పక్షంలో ఎన్నికల ముందు ఎలా ఉంటుంది అని కూడా మాయావతి పేర్కొన్నారు. ప్రజల్లో సందేహాలు కలిగేలా ఈ ప్రభుత్వం వ్యవహరించరాదని ఆమె కోరారు. కాగా- అఖిలేష్ యాదవ్, మాయావతి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో వివాదం రేపాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: T Congress: పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధరలపై గళమెత్తిన కాంగ్రెస్.. రాష్ట్రవ్యాప్తంగా ఎడ్లబండ్లతో కార్యకర్తల నిరసన.. చిత్రాలు

Anudheep KV: తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మరో తమిళ్ హీరో… ఆ స్టార్‏తో మూవీ చేయబోతున్న “జాతిరత్నాలు” డైరెక్టర్..