ముఖ్యమంత్రి తల్లికి ఆసుపత్రిలో చేదు అనుభవం.. ఏం జరిగిందంటే

హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ సుఖు తల్లికి ఓ ప్రభుత్వాసుపత్రిలో చేదు అనుభవం ఎదురైంది. ఓ వైద్యుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించడం చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. ఆ వైద్యుడికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

ముఖ్యమంత్రి తల్లికి ఆసుపత్రిలో చేదు అనుభవం.. ఏం జరిగిందంటే
Sukhvinder Singh and his Mother

Updated on: Apr 30, 2023 | 10:35 AM

హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ సుఖు తల్లికి ఓ ప్రభుత్వాసుపత్రిలో చేదు అనుభవం ఎదురైంది. ఓ వైద్యుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించడం చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. ఆ వైద్యుడికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 9న హమీర్‌పుర్‌ జిల్లాలో ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతం తర్వాత సీఎం సుఖ్విందర్‌ కూడా మూడు రోజులపాటు హమీర్‌పుర్‌లోనే పర్యటించారు.

ఈ సందర్భంగా తల్లి ఫిర్యాదుపై చీఫ్‌ మెడికల్‌ అధికారిని ఆ వైద్యుని వివరణ కోరారు. షోకాజ్‌ నోటీసుకు సమాధానం ఇచ్చిన వైద్యుడు తాను అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపాడు. రోగితోపాటు వచ్చిన కుటుంబసభ్యులను మాస్కులు ధరించమని మాత్రమే కోరానని పేర్కొన్నారు. ఆ వృద్ధురాలు ఎవరో తనకు తెలియదని.. చికిత్స అనంతరం ఆమెకు మందులు కూడా అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అయితే ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక పరిశీలించాక తగు చర్యలు తీసుకొంటామని, ఇలాంటి ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us