khushboo: అప్పుడు కమల్‌నాథ్‌.. ఇప్పుడు సాధిక్‌.. రాజకీయ దుమారం రేపుతోన్న ఐటమ్‌ కామెంట్స్‌

రాష్ట్రంలో బీజేపీ మహిళా నేతలు ఖుష్బూ, నమితా, గౌతమి, గాయత్రీ రాఘవన్‌ అందరూ ఐటమ్సే అంటూ ఆయన కాంట్రవర్షియల్‌ కామెంట్స్‌ చేశారు. వాళ్లందర్లోకీ ఖుష్బూ పెద్ద ఐటం అని ప్రత్యేకించి వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదమైంది. డీఎమ్‌కే నేత మాటలకు ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు ఖుష్బు.

khushboo: అప్పుడు కమల్‌నాథ్‌.. ఇప్పుడు సాధిక్‌.. రాజకీయ దుమారం రేపుతోన్న ఐటమ్‌ కామెంట్స్‌
Sadiq,khushboo

Updated on: Oct 30, 2022 | 8:55 AM

సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ సహజం. చేస్తారు.. చూస్తారు.. ఆనందిస్తారు. కానీ.. రాజకీయాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ వినిపిస్తే.. అవి కాస్తా కాంట్రవర్సియల్ అయితే..? తమిళనాడులో అదే జరుగుతోందిప్పుడు. సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూపై డీఎమ్‌కే నేత సైదైయ్ సాధిక్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట కలకలం సృష్టిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ మహిళా నేతలు ఖుష్బూ, నమితా, గౌతమి, గాయత్రీ రాఘవన్‌ అందరూ ఐటమ్సే అంటూ ఆయన కాంట్రవర్షియల్‌ కామెంట్స్‌ చేశారు. వాళ్లందర్లోకీ ఖుష్బూ పెద్ద ఐటం అని ప్రత్యేకించి వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదమైంది. డీఎమ్‌కే నేత మాటలకు ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు ఖుష్బు. మహిళలను కించపరిచేలా మాట్లాడేవాళ్లు కుసంస్కారులు అంటూ దుయ్యబట్టారు. ఖుష్బుపై తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తప్పేనంటూ ఖండించారు డీఎంకే మహిళా నేత కనిమొళి. సాటి మహిళగా బహిరంగ క్షమాపణలు చెపుతున్నా అన్నారు. సీఎం స్టాలిన్‌ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని హామీ ఇచ్చారు.

గతంలోనూ..

తనకు సంఘీభావం తెలిపిన కనిమొళికి థ్యాంక్స్‌ చెప్పారు ఖుష్‌బూ. కానీ.. ఈ విషయంలో ముఖ్యమంత్రి రియాక్ట్ కావాల్సిందే అన్నారు. గతంలో కూడా బీజేపీ మహిళా నేత ఇమర్తిదేవిని ఐటమ్ అని సంబోధించి ఇటువంటి వివాదంలోనే చిక్కారు మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌. 2020లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదమారం లేపాయి. ఇప్పుడు తమిళనాట కూడా కాక రేపుతోంది ఈ ఐటమ్ రచ్చ. ఇక ఇటీవల ప్రముఖ టాలీవుడ్‌ కమెడియన్‌ అభినవ్ గోమటం నటి కల్పికను ఉద్దేశించి ఐటమ్‌ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. దీనిపై కల్పిక పోలీసులను కూడా ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌ వేదికగా కొన్ని పోస్టులు షేర్‌ చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే పరిస్థతి లేదని అన్ని పార్టీల నాయకులను హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..