దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కర్ణాటక డిప్యూటీ సీఎం.. ఏకంగా రూ.14 వందల కోట్లు వెనకేశాడు

|

Jul 21, 2023 | 9:26 AM

దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిలిచారు. ఆయన నికర ఆస్తుల విలువ దాదాపు రూ.1,400 కోట్ల ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ADF) సంస్థ తన రిపోర్టులో..

దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కర్ణాటక డిప్యూటీ సీఎం.. ఏకంగా రూ.14 వందల కోట్లు వెనకేశాడు
DK Shivakumar
Follow us on

బెంగళూరు, జులై 21: దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిలిచారు. ఆయన నికర ఆస్తుల విలువ దాదాపు రూ.1,400 కోట్ల ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ADF) సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. రెండో స్థానంలో రూ.1,267 కోట్లతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్​కే పుట్టస్వామి గౌడ ఉన్నారు. మూడో ధనిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌కు చెందిన ప్రియాకృష్ణ రూ.1,156 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు కూడా కర్నాటక ఎమ్మెల్యేలే.

అంతేకాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల కంటే కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యేలే అత్యంత ధనవంతులుగా ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. టాప్‌ 20 ధనిక ఎమ్మెల్యేలలో 12 మంది కర్ణాటక ఎమ్మెల్యేలే ఉండటం విశేషం. ఈ 12 మందిలో నలుగురు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 14 శాతం కర్ణాటక ఎమ్మెల్యేలు 100 కోట్లకు పైగా ఆస్తులను కూడ బెట్టుకున్నారు. ఇక ఈ రాష్ట్రంలోని ఎమ్మెల్సీల సగటు ఆస్తులు రూ.64.3 కోట్లుగా తేలింది.

ఇక పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిర్మల్‌ కుమార్‌ కనీసం రూ.2 వేలు కూడా లేని దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా నిలిచారు. ఆయన వద్ద రూ.1700 విలువ గల ఆస్తి మాత్రమే ఉందిమరి. ఆయన తర్వాత స్థానంలో ఒడిశాకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మకరంద ముదులి రూ.15 వేల ఆస్తులతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నారు. పంజాబ్‌కు చెందిన ఆప్ నేత నరీందర్ పాల్ సింగ్ సావ్నా రూ.18,370తో చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.