Diwali 2023: కాలుష్యం పెరుగుతుందంటూ బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

|

Nov 07, 2023 | 11:39 AM

రాజస్థాన్ కు చెందిన పిటిషనర్ వేసిన పిటిషన్లపై  జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బోపన్న, జస్టిస్ సుందరేష్ బృందం తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీపావళి వేడుకల్లో బాణాసంచాపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం అనుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నాడు. అంతేకాదు ఈ తీర్పు దేశమంతటా వర్తిస్తుందని అందరికీ తెలియాలని కోరాడు.

Diwali 2023: కాలుష్యం పెరుగుతుందంటూ బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
Diwali Cracker Ban
Follow us on

హిందువులు జరుపుకునే పెద్ద పండగల్లో ఒకటి దీపావళి. ఈ పండగ కోసం చిన్న పెద్ద ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి చిమ్మ చీకట్లను తొలగిస్తూ వెలిగించే దీపాలు.. కాల్చే బాణాసంచాతో ప్రతి ఒక్కరిలోనూ దీపావళి సంతోషాన్ని తీసుకుని వస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకల సందడి మొదలైంది. మరోవైపు దేశంలో బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. రాజస్థాన్ కు చెందిన పిటిషనర్ వేసిన పిటిషన్లపై  జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బోపన్న, జస్టిస్ సుందరేష్ బృందం తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

దీపావళి వేడుకల్లో బాణాసంచాపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం అనుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నాడు. అంతేకాదు ఈ తీర్పు దేశమంతటా వర్తిస్తుందని అందరికీ తెలియాలని కోరాడు. గతంలో ఇచ్చిన తీర్పును దేశమంతటా అమలు చేయాలంటూ పేర్కొన్నాడు.  ఆస్పత్రులు, పాఠశాలలు వంటి ప్రాంతాల్లోనైనా బాణాసంచా వినియోగం లేకుండా నిషేధం విధించాలని కోరాడు పిటిషనర్.

ఇదే విషయంపై రాజస్థాన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్పందిస్తూ.. తమ రాష్ట్రంలో కాలుష్యం స్థాయుల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉందని ప్రతి వ్యక్తి టపాసులు వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

జస్టిస్ బోపన్న, జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ.. ఈ రోజుల్లో పిల్లలు బాణాసంచా కాల్చడం లేదని పెద్దలే బాణాసంచా ఎక్కువగా కాల్చుతున్నారని చెప్పారు.  పర్యావరణానికి హాని కల్గించే అంశాలపై కేవలం కోర్టులకు మాత్రమే బాధ్యత ఉందన్న తప్పుడు భావన ప్రజల్లో ఉంది. దేశంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అంతేకాదు వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను రాజస్థాన్ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని ధర్మాసనం సూచించింది. ఇదే విషయంపై పండుగ వేళల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఇంతకు మించి ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వాయు కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్గించడమే ఇక్కడ ముఖ్యని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..