Diwali 2022: దీపావళి తర్వాత ప్రాణాంతక వ్యాధుల ముప్పు పొంచివుంది.. తస్మాత్‌ జాగ్రత్త..!

|

Oct 22, 2022 | 8:07 PM

అయితే దీపావళి తర్వాత, దేశంలో కాలుష్యం పెరిగే పెను ప్రమాదం పొంచి ఉంది. మారుతున్న వాతావరణం, పంట వ్యర్థాలను కాల్చడం, పటాకులు పేల్చడం వంటి కారణాలతో..

Diwali 2022:  దీపావళి తర్వాత ప్రాణాంతక వ్యాధుల ముప్పు పొంచివుంది.. తస్మాత్‌ జాగ్రత్త..!
Diseases On Diwali
Follow us on

దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి వేడుకలకు సిద్ధమవుతున్నారు. మార్కెట్లలో దీపావళి వేడుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో అన్ని రకాల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఇటీవలి రోజుల్లో మార్కెట్లు గతంలో కంటే కొనుగోళ్లతో కలకలలాడుతోంది. అయితే దీపావళి తర్వాత, దేశంలో కాలుష్యం పెరిగే పెను ప్రమాదం పొంచి ఉంది. మారుతున్న వాతావరణం, పంట వ్యర్థాలను కాల్చడం, పటాకులు పేల్చడం వంటి కారణాలతో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఈసారి పెరుగుతున్న కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1, 2023 వరకు అన్ని రకాల పటాకుల అమ్మకం, వినియోగం, తయారీని నిషేధించింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌సీఆర్‌లో పటాకులు పేల్చడాన్ని నిషేధించింది. దీపావళి తర్వాత అనేక ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరగడం సర్వసాధారణం. మీరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఈ వ్యాధుల పట్ల జాగ్రత్త..
1. దీపావళి తర్వాత అనేక ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతుందని మనందరికీ తెలుసు . ఎందుకంటే ఈ సమయంలో చాలా నగరాల గాలిలో కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.. అంటే వారు చాలా కాలం పాటు మందులపైనే ఆధారపడుతున్నారు.

2. ప్రమాదకర గాలి నాణ్యత కారణంగా, COPD వ్యాధులు ప్రజలను ముంచెత్తుతాయి. దీని కారణంగా మీరు పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు ఇన్ఫెక్షన్‌ భారినపడే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

3. పటాకుల వల్ల వచ్చే కాలుష్యం ఆస్తమా రోగులను ప్రమాదంలో పడేస్తుంది. దీనితో పాటు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

4. పటాకుల పొగ వల్ల మనుషుల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎందుకంటే పటాకుల నుండి వచ్చే పొగ బ్రాంకైటిస్‌లో సమస్యలను కలిగిస్తుంది.

5. దీపావళి సమయంలో ప్రజలకు ఆహారంపై నియంత్రణ ఉండదు. ఈ సమయంలో ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినడం వల్ల అనేక కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. పేలవమైన జీర్ణక్రియ కారణంగా, ఊబకాయం పెరగడం ప్రారంభమవుతుంది.

6. దీపావళి తర్వాత, ప్రజలు షుగర్, హై బీపీ సమస్యను ఎదుర్కొంటారు. అధిక బీపీ ఉన్నవారు, గుండె జబ్బులతో బాధపడేవారు పటాకులు పెద్ద శబ్దంతో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి