టూల్ కిట్, దిశారవి, గ్రెటా థన్ బెర్గ్ ..ఈ మూడు ‘అంశాలు’ ఇప్పుడు పోలీసులకు చేతినిండా పని కల్పిస్తున్నాయి. టూల్ కిట్ పై తాను చేసిన ట్వీట్ ను తొలగించాల్సిందిగా కోరుతూ 22 ఏళ్ళ దిశారవి క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ ను వాట్సాప్ ద్వారా చేసిన చాటింగ్ లో కోరిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల ఆ ట్వీట్ ను డిలీట్ చేయాలని ఆమె కోరిందని, దాంతో గ్రెటా ఆ ప్రకారం డిలీట్ చేసి ఎడిట్ చేసిన ట్వీట్స్ ను ప్రచురించిందని వారు చెప్పారు. తాను తన లాయర్లతో వెళ్తున్నానని, మనపేర్లు ఆ డాక్యుమెంట్ లో ఉన్నాయని, మనపై ఈ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని దిశారవి పేర్కొన్నట్టు వారు చెప్పారు. ఈ డాక్యుమెంట్ ట్విటర్ తుపానునే సృష్టించింది. రైతుల నిరసన, విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల వద్ద ప్రొటెస్ట్, జనవరి 26 నాటి రైతుల ట్రాక్టర్ ర్యాలీ వంటి పలు అంశాలను ఈ డాక్యుమెంట్ ‘స్పృశించింది’.
ఇది డైనమిక్ డాక్యుమెంట్ అని, ఇందులో వివిధ గూగుల్ డైవ్స్, గూగుల్ డాక్, వెబ్ సైట్ లింకులతో ఇది కూడి ఉందని ఢిల్లీ డీసీపీ అన్వేష్ రాయ్ తెలిపారు. ఈ వెబ్ సైట్స్ లో చాలా వరకు ఖలిస్తానీ అనుకూల కంటెంట్ ఉందన్నారు. అందుకే దీన్ని ఓ ‘యాక్షన్ ప్లాన్’ గా పరిగణించవచ్చునన్నారు. ఈ విధమైన డాక్యుమెంట్ ను పబ్లిక్ గా షేర్ చేయరాదని, ఇది ప్రయివేట్ అని, కానీ కాకతాళీయంగా షేర్ చేశారని అన్నారు. భారత దేశ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఈ టూల్ కిట్ ను క్రియేట్ చేశారని ఢిల్లీ పోలీసులు మొదట తెలిపారు.
Also Read:
TSRTC: తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి.. ఇంకా ఉద్యోగులకు అందని జీతాలు..
Madhyapradesh Accident: మధ్యప్రదేశ్ ఘోర బస్సు ప్రమాదంపై స్పందించిన అమిత్ షా.. కార్యక్రమం రద్దు