‘చైనాతో చర్చలు కాన్ఫిడెన్షియల్.. ఏదీ ముందుగా ఊహించి చెప్పజాలం’ అన్నారు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్. సరిహద్దుల్లో ఉద్రిక్తతపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన..అంతా రహస్యం అంటే రహస్యమే అన్నట్టు జవాబిచ్చారు. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా చర్చలైతే జరుగుతున్నాయని, ఇవి పురోగమన దశలో సాగుతున్నాయన్నారు. అయితే నియంత్రణ రేఖ పొడవునా సైనికుల మోహరింపు ఉందని, ఇటీవలి కాలంలో ఇలా జరగలేదని జైశంకర్ చెప్పారు. లడాఖ్ లో పరిస్థితి గురించి ఇంతకు మించి ఏమీ చెప్పలేమన్నారు. అసలు వార్ కి రెడీగా ఉండాల్సిందిగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తమ దేశ సైనికులకు పిలుపునిఛ్చినట్టు వఛ్చిన వార్తలపై ఆయనను ఒక్క జర్నలిస్థూ అడగలేదు. 30 ఏళ్లుగా చైనాతో భారత్ శాంతి మంత్రమే జపిస్తోందని జైశంకర్ అన్నారు. శాంతి, సుస్థిరతలు నెలకొనేలా చూడలేకపోయినా, ఒప్పందాలు అమలు కాకపోయినా అప్పుడు అనిశ్చితి తలెత్తుతుంది అని వ్యాఖ్యానించారు.