
దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ అయిన టీవీ9 నెటవర్క్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు అతిథులకు ఆహ్వానం పలుకుతూ TV9 నెట్‌వర్క్ MD అండ్ CEO బరున్ దాస్ స్వాగతోపన్యాసం చేశారు. దీంతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఇక అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభ సెషన్‌లో పూనావాలా ఫిన్‌కార్ప్ ఎండి అభయ్ భూతాడ ప్రసంగించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడంలో మోదీ ప్రభుత్వం ఇలాంటి డిజిటల్ కార్యక్రమాలు దోహదపడతాయని పూనావాలా ఫిన్‌కార్ప్ ఎండీ అభయ్ భూతాడ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ డిజిటల్ చెల్లింపుల పరిష్కారాలతో, ఇప్పుడు దేశంలోని సామాన్య ప్రజలు కూడా దేశ నిర్మాణంలో తమ పాత్రను పోషించగలుగుతున్నారని ఆయన అన్నారు.
ఇక భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం దేశంలో అందరినీ కలుపుకుని పోయే విప్లవానికి నాంది పలికిందని అన్నారు. ఇది ప్రపంచంలో భారతదేశం తన ఆర్థిక స్థితిని పొందేందుకు సహాయపడుతుంది, త్వరలో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది అని అన్నారు. మోదీ ప్రభుత్వంలో ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ దేశంలో పారిశ్రామికవేత్తలను పెంచిందని అభయ్ భూతడా అన్నారు. భారీ ఉపాధి కల్పనలో కూడా పాత్ర పోషించిందని తెలిపారు.
మోదీ ప్రభుత్వ శ్రేయస్సు లక్ష్యాన్ని చేరుకోవడంలో కూడా ఇది ఉపయోగపడనుందని అభయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే టీవీ9 గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమం ఆదివారం ఢిల్లీలోని అశోక్ హోటల్‌లో ప్రారంభమైంది. టీవీ9 నెట్‌వర్క్ ఎండి, సిఇఒ బరున్ దాస్ ప్రోగ్రాం ప్రారంభ సెషన్‌లో అందరికీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు భారతదేశ భవిష్యత్తు.. ప్రపంచంలో దీనికి పెరుగుతున్న సాఫ్ట్ పవర్ గురించి ఎలా ఆలోచనలు చేస్తారో ఆయన చెప్పారు.
WITT ఈవెంట్ లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..