ఇరాన్‌పై దాడికి భారత ఎయిర్‌ స్పేస్‌లను అమెరికా వాడుకుందా? ఇందులో నిజమెంతా?

సోషల్ మీడియాలో వ్యాపించిన వార్తలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ షేక్ అని తేల్చింది. అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్‌లో భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించలేదని PIB స్పష్టం చేసింది. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ప్రెస్ మీటింగ్‌లో ఈ విషయాన్ని వివరించారు.

ఇరాన్‌పై దాడికి భారత ఎయిర్‌  స్పేస్‌లను అమెరికా వాడుకుందా? ఇందులో నిజమెంతా?
Pm Modi And Trump

Updated on: Jun 23, 2025 | 8:11 AM

ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై దాడికి ప్రారంభించిన ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్‌ను నిర్వహించడానికి అమెరికా సైన్యం భారత ఎయిర్‌ స్పేస్‌లను ఉపయోగించుకుందని సోషల్ మీడియాలో వ్యాపించిన వాదనలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ షేక్‌ అని తేల్చింది. ఆదివారం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో.. PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనను నకిలీగా పేర్కొంది. ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్‌ ఎయిర్‌ స్పేస్‌లను ఉపయోగించలేదని స్పష్టం చేసింది.

ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై సైనిక దాడులు చేయడానికి అమెరికా దళాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకున్నాయని అనేక సోషల్ మీడియా పోస్టులు పుట్టుకొచ్చాయి. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ నిర్వహించిన ప్రెస్ మీటింగ్‌ను ఉటంకిస్తూ.. అమెరికా విమానాలు తీసుకునే ప్రత్యామ్నాయ మార్గాలను వివరిస్తూ, ఆ వాదనలను నిరాధారమైనవిగా తేల్చారు. “ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ సమయంలో ఇరాన్‌పై విమానాలను ప్రయోగించడానికి అమెరికా భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించిందని అనేక సోషల్ మీడియా ఖాతాలు పేర్కొన్నాయి. ఈ వాదన అబద్ధం. ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ సమయంలో అమెరికా భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించలేదు. ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా.. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్ జనరల్ డాన్ కెయిన్ యుఎస్ విమానం ఉపయోగించే మార్గాన్ని వివరించారు,” అని ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పేర్కొంది.

ఆదివారం ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడుల తర్వాత అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ మాట్లాడుతూ.. ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ ఇరాన్ అణ్వాయుధ మౌలిక సదుపాయాకు తీవ్ర నష్టాన్ని కలిగించాం అని అన్నారు. పెంటగాన్‌లో విలేకరుల సమావేశంలో జనరల్ కెయిన్ ఆపరేషన్ వివరణాత్మక మ్యాప్, కాలక్రమాన్ని సమర్పించారు. ఇది US విమానాలు ఏవీ భారత గగనతలంలోకి ప్రవేశించలేదని చూపించింది. సుమారుగా సాయంత్రం 6:40 EST ఇరాన్ సమయం ప్రకారం తెల్లవారుజామున 2:10 గంటలకు B-2 రెండు విమానాలు ఫోర్డో వద్ద ఉన్న అనేక లక్ష్య పాయింట్లలో మొదటి దానిపై GBU 57 MOP (మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్) ఆయుధాలతో దాడి చేశాయి. మిగిలిన బాంబర్లు కూడా తమ లక్ష్యాలను ఢీకొట్టాయి. మొత్తం 14 MOPలు రెండు అణు లక్ష్య ప్రాంతాలపైకి జారవిడిచాయి. మూడు ఇరానియన్ అణు మౌలిక సదుపాయాల లక్ష్యాలను సాయంత్రం 6:40, 7:05 EST (ఇరాన్ స్థానిక సమయం ఉదయం 2:10) మధ్య ధ్వంసం చేశాం అని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..