Anand Mahindra Shocked : శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు పెద్దలు.. దీనిని కొంతమంది బాగా ఒంటబట్టించుకున్నారు.. అయితే అది మంచి చేయడానికి..మంచి దారిలో వెళ్ళడానికి కాదు.. తమ అక్రమ సంపాదన కోసం తెలివి తేటలకు పదును పెట్టి.. ఓ రేంజ్ లో మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇదే విషయం పై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..
ఆనంద్ మహీంద్రా చేసే ట్విట్స్ కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఎదురుచూస్తుంటారు.. ఎందుకంటే ఆయన చేసే ట్విట్ ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని ఆలోచింపజేస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని కన్నీరు పెట్టిస్తాయి.. అంతగా ఆయన సోషల్ మీడియా ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తారు.. అయితే ఈ సారి ఆనంద్ మహీంద్రా చేసిన ట్విట్ డిఫరెంట్ గా ఉంది..
ఒక పికప్ ట్రక్కులో కింద బయటకు కనిపించకుండా అమర్చిన డ్రాలో వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు, కార్టన్లు దర్శనమిచ్చాయి. కొంతమంది అక్రమంగా మద్యం తరలించడానికి ఈ పద్దతిని ఎంచుకున్నారు. ఈ ఐడియాను మహీంద్రా తప్పుపట్టారు. తమ పికప్ ట్రక్ డిజైనింగ్‌లో ఇది భాగం కాదని.. భవిష్యత్‌లోనూ దీన్నెప్పటికీ భాగం చేయమంటూ ఆయన స్పష్టం చేశారు.
ఎవరో ఇతను భయంకరమైన తెలివైనవాడు. ట్రక్ లో సరుకు రవాణాకు కొత్త అర్థం చెప్పాడు.. అయితే మా పరిశోధనా కేంద్రంలో పికప్ ట్రక్ డిజైనింగ్ మార్పుల్లో ఈ ఆలోచనకు తావు లేదు.. ఇక ముందు ఉండదు కూడా అంటూ ట్రాక్ ఇలా అక్రమ రవాణా కోసం ఉపయోగించడాన్ని అయన ఖండించారు. అయితే ఈ ట్రక్ లో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న తీరు అంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. అయితే ఎక్కడ ఎప్పుడు అనే విషయంలో స్పష్టత లేదు.
Also Read: బుల్లితెరపై సందడి చేయనున్న మక్కల్ సెల్వన్.. త్వరలోనే టీవీషోతో రానున్న విజయ్ సేతుపతి..