రాహుల్‌ గాంధీ అజ్ఞానం మరోసారి బయటపడింది.. ఫైర్‌ అయిన ధర్మేంద్ర ప్రధాన్‌

ఒడిశా రాష్ట్రంలో జరుగుతోన్న భారత్‌ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో తెలి కులంలో మోదీ పుట్టారని, రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ ఓబీసీ కులంలో పుట్టలేదని అందుకే, కుల గణన చేయటం లేదంటూ విమర్శించారు. 2 వేల సంవత్సరంలో...

రాహుల్‌ గాంధీ అజ్ఞానం మరోసారి బయటపడింది.. ఫైర్‌ అయిన ధర్మేంద్ర ప్రధాన్‌
Dharmendra Pradhan, Rahul G

Updated on: Feb 08, 2024 | 9:15 PM

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి ఓబీసీ కులంలో పుట్టలేదని, ఆయన పదేపదే తన కులం గురించి అబద్దాలు చెబుతున్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ఒడిశా రాష్ట్రంలో జరుగుతోన్న భారత్‌ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో తెలి కులంలో మోదీ పుట్టారని, రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ ఓబీసీ కులంలో పుట్టలేదని అందుకే, కుల గణన చేయటం లేదంటూ విమర్శించారు. 2 వేల సంవత్సరంలో మోదీకి ఓబీసీ కులం కార్డును.. బీజేపీ ఇచ్చిందని.. కులంతో ఓట్ల రాజకీయం చేసిందని ఆరోపించారు రాహుల్ గాంధీ.

ఓబీసీ కులంలో పుట్టినట్లయితే.. ఎందుకు కుల గణన చేయటం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. మోదీ తన కులం గురించి ఎప్పుడూ అబద్దాలే చెబుతారని.. పుట్టింది తెలి కులంలో అని కొత్తగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. రాహుల్‌ గాంధీపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు.

ఇదే విషయమై.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సైతం స్పందించారు. మోదీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వట్టర్‌ వేదికగా ఘాటూగా ట్వీట్‌ చేశారు. ‘ఎప్పటిలాగే రాహుల్‌ గాంధీ మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. రాహుల్‌ గాంధీ పదే పదే అబద్ధాలు చెప్పడం ద్వారా నిజమవుతాయని భావిస్తున్నారు. రాహుల్‌ గాంధీ తనకు తాను న్యాయం చేసుకోవాలి. రోజూ అబద్ధాలు ప్రచారం చేస్తే.. కేవలం హాస్యం, వినోదానికి పరిమితమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు’ అంటూ రాసుకొచ్చారు. ఇక ఇదే విషయమై.. రాజ్యసభ సభ్యుడు నరహరి అమిన్‌ సైతం స్పందించారు. ప్రతిపక్షాలు బుద్ధిలేని అబద్ధాలను వండివారుస్తున్నాయని విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..