AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధనుష్ చుట్టూ పొలిటికల్ కంచె.. అతను బీజేపీ వదిలిన బాణమా..?

తమిళనాట ఆ హీరో ఇంకా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు.కానీ ఇచ్చినంత హడావుడి మాత్రం పొలిటికల్ తెరపై కనిపిస్తోంది. పాలిటిక్స్‌పై ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో కానీ, అభిమాన ప్రపంచం మాత్రం ఈజ్ కమింగ్ అంటూ లీకుల మీద లీకులు ఇస్తోంది. ఈలీకుల మీదనే విపక్షాలు పెద్ద పెద్ద మేకులను బిగించి కొడుతున్నాయి. అంతా కమలం స్కెచ్ అంటూ విమర్శలు కూడా చుట్టుముట్టాయి. ఆపరేషన్-Dపేరుతో ఢిల్లీ నుంచే చక్రం తిప్పుతున్నారంటూ కాంగ్రెస్ ఆల్రెడీ ఓబండవేసింది. ఇంతకూ కాంగ్రెస్ ఆరోపణల్లో నిజమెంత..ఆపరేషన్ డి అంటే ఏమిటి.? తెర వెనుక నిజంగానే ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా?

ధనుష్ చుట్టూ పొలిటికల్ కంచె.. అతను బీజేపీ వదిలిన బాణమా..?
Dhanush
Ram Naramaneni
|

Updated on: Oct 26, 2026 | 8:57 PM

Share

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త లెక్కలు.. కొత్త అనుమానాలు.. తెరపైకి వస్తున్నాయి. విజయ్ రాజకీయ రంగప్రవేశంతో ఇప్పటికే ఆసక్తికరంగా మారిన తమిళ పాలిటిక్స్‌లో.. ఇప్పుడు మరో హీరో ధనుష్ చుట్టూ చర్చ కాదు రచ్చే మొదలైంది.

తమిళనాడు రాజకీయాల్లో హీరోల ఎంట్రీ కొత్త కాదు. కానీ ఇప్పుడు ధనుష్ రాజకీయాల్లోకి వస్తాడా రాడా అన్నదానిపై క్లారిటీ లేకుండానే పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ధనుష్ ఇప్పటివరకు రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పలేదు. అయినా ఆయన అభిమాన సంఘాల యాక్టివిటీస్ , వరుస సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చెన్నైలోని తొరైపాక్కంలో 3వేల మందికి పైగా మహిళా అభిమానులతో ధనుష్ మీటింగ్ పెట్టడం రాజకీయంగా అందరినీ ఫోకస్‌ అయ్యేలా చేసింది. గతంలో ధనుష్ నర్పణి మండ్రంగా ఉన్న అభిమాన సంఘం పేరును నర్పణి ఇయక్కంగా మార్చడం, అభిమానులతో సమావేశాలు నిర్వహించడం.. సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టడంతో ధనుష్ రాజకీయ ఎంట్రీ త్వరలోనే ఉండబోతోందన్న ప్రచారం ఊపందుకుంది.

అంతేకాదు ఈ కార్యక్రమంలో ధనుష్ తెల్ల చొక్కా, పంచె ధరించి ఫక్తు పొలిటీషియన్ లుక్‌లోనే అభిమానులకు కనిపించారు. ఒక్కొక్కరినీ పలకరిస్తూ, వారితో ఫొటోలు దిగారు. అభిమానుల కోసం పాట కూడా పాడారు. సమావేశంలో ఆయన ప్రసంగం మాత్రం కొద్దిసేపే సాగింది. అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పడంతో పాటు, బాగా చదువుకోవాలని, తమ పనులను చక్కగా చేసుకోవాలని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అయితే ఈసమావేశంలో అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం మహిళా అభిమానులకు ధనుష్ ఇచ్చిన బహుమతి. ప్రతి ఒక్కరికీ వెండి కామాక్షి దీపాన్ని బహుమతిగా అందించారు. అందులో దానిపై కమలాన్ని పోలిన ముద్ర ఉండటంతో పొలిటికల్ రచ్చ మదలైంది. ఇదంతా బీజేపీ వెనుక ఉండి నడిపిస్తున్న తతంగం అంటూ కాంగ్రెస్ వెంటనే అందుకుంది. ధనుష్ వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యూహం ఉందని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ మాణిక్యం ఠాగోర్ ఆరోపించారు.

“తమిళనాడులో బీజేపీ ఆపరేషన్‌ డీ మొదలు పెట్టింది. వీళ్ల రిమోట్ కంట్రోల్‌ మొత్తం ఢిల్లీలోనే ఉంది. ఇదంతా బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ వ్యూహంలో భాగమే. బీజేపీ తమకు అనుకూలంగా ఒక సినీ నటుడిని ముందుపెట్టి రాజకీయాలు చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఏఐఏడీఎంకేను బలహీనపరిచింది. గతంలో రజనీకాంత్‌తో పార్టీ పెట్టించేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు ఆపరేషన్ Dపేరుతో తమిళనాడులో బలపడాలని చూస్తోంది” అని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ మాణిక్యం ఠాగోర్ పేర్కొన్నారు.  అయితే విపక్షాల విమర్శలను టీవీకే కొట్టి పారేసింది. దీపంపై ఉన్న కమలం ముద్ర తయారీ దారు వేసిన ముద్ర తప్ప, ఇందులో ఎలాంటి పొలిటికల్ ఇంటెన్షన్ లేదని చెబుతోంది.

మరోవైపు.. ధనుష్‌ను లక్ష్యంగా చేసుకుని టీవీకే మంత్రి ఆదవ్‌ అర్జున చేసిన విమర్శలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. డీఎంకే సైతన్ పోయింది‌‌..ఇప్పుడు పిల్ల సైతాన్లు రాజకీయాల్లోకి రాబోతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తుల వెనుక ఢిల్లీలోని పెద్ద నాయకుల మద్దతు ఉంటోందంటూ టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున ఆరోపించారు.

మొత్తానికి ధనుష్ ఢిల్లీ పర్యటనపై వచ్చిన వార్తలు, కొత్త పార్టీకి ‘తమిళగ ఎళుచ్చి కళగం’ అనే పేరు ఉండొచ్చన్న ప్రచారం, ఇలా ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై అనేక ఊహాగనాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వీటిపై ధనుష్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చెబుతున్న ఆపరేషన్-D నిజంగా బీజేపీ వ్యూహమా? ధనుష్ విజయ్ బాటలో అడుగులు వేస్తున్నారా? అన్న ఆసక్తికర చర్చైతే జరుగుతోంది. మరి చూడాలి ధనుష్ అడుగులు సేవా కార్యక్రమాలతో ఆగుతుందా..లేక పొలిటికల్ జెండా, అజెండా వరకు వెళ్తుందా ? అన్నది.

Follow Us