Draupadi Temple: ద్రౌపది ఆలయ ఉత్సావాల్లో అపశృతి.. నిప్పులగుండం దాటుతూ అందులో పడిన యువకుడు

|

May 22, 2022 | 9:06 AM

పాండవుల పత్ని పాంచాలీకి మన దేశంలో ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కేంద్ర ప్రాంత పాలితమైన పుదుచ్చేరిలో కూడా ఉంది. ఈ ద్రౌపది ఆలయంలో ప్రతి ఏడాది ఉత్సవాలు జరుగుతాయి.

Draupadi Temple: ద్రౌపది ఆలయ ఉత్సావాల్లో అపశృతి.. నిప్పులగుండం దాటుతూ అందులో పడిన యువకుడు
Draupadi Temple Utsvalu
Follow us on

Draupadi Temple: మనదేశంలో సర్వసాధారణంగా అమ్మవారి ఆలయాల్లో ఎక్కువగా దుర్గామాత ఆలయాలు అధికంగా ఉంటాయి. ఆ ఆలయంలో అమ్మవారిని పూజించి భక్తులు అనుగ్రహం పొందుతారు.. కానీ పాండవుల పత్ని పాంచాలీకి ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కేంద్ర ప్రాంత పాలితమైన పుదుచ్చేరిలో కూడా ఉంది. ఈ ద్రౌపది ఆలయంలో ప్రతి ఏడాది  ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు.

పుదుచ్చేరి నెట్టపాక్కం గ్రామంలోని ద్రౌపది ఆలయ ఉత్సావాలు అంగరంగ వైభంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది.  ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండం దాటుతుండగా ఓ యువకుడు ఆ నిప్పుల గుండంలో పడిపోయాడు. దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ  ద్రౌపది అమ్మవారి ఆలయంలోని ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే అగ్ని గుండాన్ని దాటి భక్తులు తమ మొక్కలు చెల్లించుకోవడం ఇక్కడ ఆచారం. ఈ క్రమంలో ఓ భక్తులు తన మొక్కు చెల్లించుకుంటుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..