రాంచీ, మే 27: బార్‌లో మద్యం తాగేందుకు నిరాకరించాడంతో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో డీజేని కాల్చి హత్య చేశారు. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ బార్ కు సోమవారం తెల్లవారుజామున 1 గంటకు బార్ క్లోజ్ చేసిన అనంతరం నిందితుడితో సహా ఐదుగురు వ్యక్తులు బార్‌కు వచ్చారు. తమకు మద్యం అందించాలని డిమాండ్ చేశారు. అందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. దీంతో నిందితులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో షార్ట్‌లో ఉన్న ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి చేతిలో తుపాకీతో బార్‌లో డీజేగా ఉన్న శాండీ అనే వ్యక్తికి అతి సమీపంగా వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. పాయింట్ బ్లాంక్ నుంచి డీజే ఛాతిపై కాల్చడంతో.. అక్కడికక్కడే డీజే శాండీ కుప్పకూలాడు. కాల్పుల ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడిని వెంటనే రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
रांची के एक्सट्रीम बार में डीजे सैंडी को गोली मारने का वीडियो, रात में 1:00 बजे के बाद गोली मारी गई है जबकि बार बंद करने का टाइम 11:00 है ऐसे में पुलिस का ढीला रवैया प्रश्न चिन्ह खड़ा करता है रांची में बहुत से बाहर दो-तीन बजे रात तक चलते हैं#xtremebarranchi #brekingnews #ranchi pic.twitter.com/p61Nu2KrvI
— Prem Shankar (@prem_sanmarg) May 27, 2024
సమాచారం అందుకున్న రాంచీ డీఎస్పీ, స్థానిక ఎస్‌హెచ్‌ఓ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాంచీ ఎస్‌ఎస్‌పి చందన్ సిన్హా తెలిపారు. దర్యాప్తులో భాగంగా బార్‌లోని సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడిని, అతని సహచరులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.