Supreme Court: నోయిడా ట్విన్‌ టవర్స్‌‌ను కూల్చాల్సిందే.. కీలక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు

|

Oct 04, 2021 | 7:35 PM

Supertech's Noida twin towers: నోయిడా లోని ట్విన్‌ టవర్స్‌ను కూల్చాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒక్క టవర్‌కు మినహాయింపు ఇవ్వాలన్న సూపర్‌టెక్‌ సంస్థ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.

Supreme Court: నోయిడా ట్విన్‌ టవర్స్‌‌ను కూల్చాల్సిందే.. కీలక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు
Supertech's Noida Twin Towers
Follow us on

Supertech’s Noida twin towers: నోయిడా లోని ట్విన్‌ టవర్స్‌ను కూల్చాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒక్క టవర్‌కు మినహాయింపు ఇవ్వాలన్న సూపర్‌టెక్‌ సంస్థ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఢిల్లీ శివార్ల లోని నోయిడా అక్రమంగా నిర్మించిన ట్విన్‌ టవర్స్‌ విషయంలో సూపర్‌టెక్‌ బిల్డర్స్‌కు సుప్రీంకోర్టు మరోసారి షాకిచ్చింది. ట్విన్‌ టవర్స్‌ను తాము విధించిన గడువులోగా కూల్చాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

ఒక్క టవర్‌ను కూల్చివేత నుంచి మినహాయింపు ఇవ్వాలన్న సూపర్‌టెక్‌ బిల్డర్స్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆగస్ట్‌ 31న నోయిడా ట్విన్‌ టవర్స్‌పై కీలక తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు. నోయిడా లోని ఎమిరాల్డ్‌ కోర్టు ప్రాజెక్ట్‌లో భాగంగా 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ను నిర్మించింది సూపర్‌టెక్‌ సంస్థ. అయితే నిబంధలను విరుద్దంగా ఈ టవర్స్‌ను నిర్మించారని , అధికారులు ముడుపులు తీసుకొని అనుమతులు ఇచ్చారని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత నోయిడా డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ట్విన్‌ టవర్స్‌కు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంది యూపీ ప్రభుత్వం.

మరోవైపు, ట్విన్‌ టవర్స్‌లో ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్న ప్రజలకు డబ్బును వెంటనే చెల్లించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లోగా డబ్బులు చెల్లించాలని సూపర్‌ టెక్‌ బిల్డర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేస్తే కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని , పర్యావరణానికి కూడా హానీ జరుగుతుందన్న సూపర్‌టెక్‌ బిల్డర్స్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. 2014లోనే ట్విన్‌ టవర్స్‌ను కూల్చేయాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సూపర్‌టెక్‌ బిల్డర్స్‌ సుప్రీంకోర్టు వెళ్లినప్పటికి కూడా చుక్కెదురయ్యింది. నోయిడా అథారిటీకి చెందిన 26 మంది అధికారులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు యూపీ ప్రభుత్వం నియమించిన దర్యాప్తు కమిటీ విచారణలో వెల్లడయ్యింది. అందులో కేవలం నలుగురు మాత్రమే ఇంకా సర్వీసులో ఉన్నారు. 20 మంది అధికారులు ఇప్పటికే రిటైర్‌ కాగా ఇద్దరు చనిపోయారు.

Read Also… క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న యువత.. ప్రేమ పేరుతో నయవంచనకు గురై ఒకరు.. పేరెంట్స్ తింటారని మరొకరు..!