శ్రద్ధా వాకర్ హత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో హిందూ ఏక్తా మంచ్ ఆధ్వర్యలో నిర్వహించిన సభలో హైడ్రామా చోటు చేసుకుంది. సమావేశంలో మహిళ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. మైక్ లాక్కున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ తన మైక్‌ను లాక్కున్న వ్యక్తిని చెప్పుతో కొట్టింది. పదేపదే చెప్పుతో ఆ వ్యక్తిని ఆమె కొట్టింది. స్టేజ్‌పై ఉన్నవాళ్లు ఆ మహిళకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. అతని కాలర్ పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టేసింది.
అయితే, ఈ ఘటన వెనుక మరో కీలక అంశం దాగుంది. మహిళకు , చెప్పు దెబ్బలు తిన్న వ్యక్తికి మధ్య అంతకంటే ముందే గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. తన కూతురిని ప్రేమ పేరుతో ఆ వ్యక్తి కుమారుడు వెంబడి తీసుకెళ్లాడని ఆ మహిళ ఆరోపించారు. అదే విషయాన్ని ఆమె స్టేజ్‌పై ప్రస్తావించారు. నాలుగు రోజుల నుంచి తన కూతురి జాడ లేదని ఆమె చెబుతుండగా ఆ వ్యక్తి అడ్డుకోవడంతో గొడవ జరిగింది.
#WATCH | Chattarpur, Delhi: Woman climbs up the stage of Hindu Ekta Manch’s program ‘Beti Bachao Mahapanchayat’ to express her issues; hits a man with her slippers when he tries to push her away from the mic pic.twitter.com/dGrB5IsRHT
— ANI (@ANI) November 29, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..