
ఢిల్లీ పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేలుడుకు పాల్పడ్డ ఉమర్‌కు సహకరించిన అమీర్‌ను ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. అమీర్‌కు 10 రోజుల NIA కస్టడీ విధించింది న్యాయస్థానం. అమీర్ పేరు మీదే i20 కారు ఉన్నట్టు గుర్తించారు. అందుకే పోలీసులు అమీర్‌ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ పేలుళ్ల కుట్రలో అమీర్ ప్రమేయం ఉందని, అతని విచారణ అవసరమని కోర్టు పేర్కొంది. రిమాండ్ సమయంలో, నిందితుల నుండి బాంబు పేలుళ్లకు సంబంధించిన అన్ని సమాచారాన్ని ఏన్ఐఏ సేకరించి, కేసు ఇతర అంశాలను దర్యాప్తు చేస్తుంది.
నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో జరిగిన కారు బాంబు దాడిలో నిందితుడైన అమీర్ రషీద్ అలీని NIA అరెస్టు చేసింది. నిందితుడు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ ఉన్ నబీతో కలిసి ఈ పేలుడుకు కుట్ర పన్నాడని ఆరోపణలు ఉన్నాయి. అమీర్ జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్‌లోని సంబురా నివాసి. IED అమర్చి పేల్చిన కారు అతని పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. పాంపోర్‌లో అమీర్‌ను NIA అదుపు లోకి తీసుకుంది. ఢిల్లీకి వచ్చిన i20 కారును కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఢిల్లీ పేలుడులో అమీర్ పాత్ర కూడా ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటివరకు 73 మంది సాక్ష్యులను విచారించారు. ఢిల్లీ పేలుడులో 13 మంది చనిపోయారు 34 మందికి తీవ్రగాయాలయ్యాయి. సూసైడ్ బాంబర్ ఉమర్‌కు చెందిన మరో కారును కూడా సీజ్ చేశారు.
ఢిల్లీలో NIA దాడులు నిర్వహించి అమీర్‌ను అరెస్టు చేసింది. పేలుడు కోసం ఆమిర్ ప్రత్యేకంగా కారు కొనడానికి ఢిల్లీకి వచ్చాడని, తరువాత దానిని వాహనం నుండి వచ్చే బాంబు (VBIED)గా మార్చారని దర్యాప్తులో తేలింది. ఫోరెన్సిక్ పరీక్షల్లో కారు డ్రైవర్ మరణించిన ఉమర్ ఉన్ నబీ అని నిర్ధారించారు. పుల్వామాకు చెందిన ఉమర్, హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు.
అమీర్ కుటుంబం అతను ప్లంబర్‌గా పనిచేస్తున్నాడని, అతని సోదరుడు ఉమర్ ఎలక్ట్రీషియన్ అని పేర్కొంది. అమీర్ ఎప్పుడూ ఢిల్లీకి వెళ్లలేదని, కారు మాత్రమే అతని పేరు మీద ఉందని కుటుంబం పేర్కొంది. ఉమర్‌కు చెందిన మరో కారును కూడా NIA స్వాధీనం చేసుకుని సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటివరకు, ఏజెన్సీ 73 మంది సాక్షులను, గాయపడిన వ్యక్తుల నుండి వాంగ్మూలాలను నమోదు చేసింది. సాంకేతిక మరియు డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తోంది.
వీడియో చూడండి.
VIDEO | Delhi: In the Red Fort terror blast case, accused Amir Rashid Ali – who was arrested by the National Investigation Agency (NIA) yesterday – is seen being taken from Patiala House Court.
The Delhi court has sent him to 10-day NIA custody.#DelhiBlast #NIA #RedFort… pic.twitter.com/dcWS7w8IVr
— Press Trust of India (@PTI_News) November 17, 2025
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..