Delhi Rains: దేశ రాజధానిని వణికిస్తున్న వర్షాలు.. ఎయిర్‌పోర్టులోకి చేరిన నీరు.. షాకింగ్‌ వీడియో..

Heavy rains lash Delhi:దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో

Delhi Rains: దేశ రాజధానిని వణికిస్తున్న వర్షాలు.. ఎయిర్‌పోర్టులోకి చేరిన నీరు.. షాకింగ్‌ వీడియో..
Delhi Ncr Rains Airport

Updated on: Sep 11, 2021 | 12:05 PM

Heavy rains lash Delhi:దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతోపాటు పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా ఏయిర్‌ పోర్టులోకి వరద నీరు చేరింది. ప్రవేశ ద్వారం వద్ద నుంచి లోపల వరకు వరద నీరు చేరింది. ఈ మేరకు పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు చేశాయి. రాకపోకలు, విమానాలు బయలుదేరడంలో ఆలస్యమయ్యే సూచనలున్నాయని.. ప్రయాణికులు గమనించగలరని సూచించాయి.


వర్షాల కారణంగా రోడ్లపై భారీగా వరద పోటెత్తింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఢిల్లీలో గత 19ఏళ్లల్లో సెప్టెంబర్‌ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన జూన్ 1 నుంచి ఢిల్లీలో 987.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 81 శాతం ఎక్కువ అని ఐఎండీ అధికారులు వివరించారు.

Also Read:

Crime News: చెల్లిని దారుణంగా చంపిన అన్న.. వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని.. తుపాకీతో..

Crime news: సైదాబాద్ బాలికపై అత్యాచారం, హత్య ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు..