Delhi Public School: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో బాంబు బెదిరింపు కలకలం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

ఇదివరకు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు లేదా ఎయిర్‌పోర్టులలో బాంబులు పెట్టామంటూ ఫోన్ చేసిన బెదిరించేవారు. ఇప్పడు ఈ వ్యవహారం పాఠశాలలపై కూడా వస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో ఓ బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది.

Delhi Public School: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో బాంబు బెదిరింపు కలకలం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Delhi Public School

Updated on: Apr 26, 2023 | 11:38 AM

ఇదివరకు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు లేదా ఎయిర్‌పోర్టులలో బాంబులు పెట్టామంటూ ఫోన్ చేసి బెదిరించేవారు. ఇప్పడు ఈ వ్యవహారం పాఠశాలల వరకు వచ్చేసింది. తాజాగా ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో ఓ బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. బుధవారం రోజున మథురా రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఓ మెయిల్ వచ్చింది. అది చూడగా పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ రాసుకొచ్చారు. దీంతో పాఠశాల యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. వెంటనే విద్యార్థులను అక్కడి నుంచి పంపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌లు తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అసలు ఆ మెయిల్ ఎవరు, ఎందుకు పంపించారు అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరిగ్గా రెండు వారాల క్రితం కూడా ఇదే తరహాలో దిల్లీ పాఠశాలకు ఈ-మెయిల్ వచ్చింది. సాదిఖ్ నగర్‌లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణంలో బాంబులు ఉన్నాయని అందులో చెప్పడంతో ఆందోళనకు గురైన యాజమాన్యం.. విద్యార్థులు, టీచర్లను బయటకు పంపించింది. అయితే అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేవు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..