
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్రిముఖ పోటీ నెలకొంటోంది. అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంటోంది. పేద, మధ్య తరగతి ప్రజలను తమ వైపునకు తిప్పుకునేలా ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలను గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్.. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునే ఏడు అంశాలను ఈ మేనిఫెస్టోలో పెంచుపర్చారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర వార్షిక బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో బీజేపీని
పన్నుల ద్వారా వచ్చే సొమ్మును విద్యతో పాటు ద్రవ్యాల్బోణం నుంచి మధ్యతరగతి వారిని కాపాడేందుకు తాము వినియోగిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలు, నీటి ఛార్జీలను తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులను పెంచినట్లు గుర్తుచేశారు.
ఆమ్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అతిషి సైతం పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారంటూ అతిషి ఫైర్ అయ్యారు.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నారు. 70 స్థానాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థుల సంఖ్య పెరిగింది. అర్వింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూడిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇదే.
ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి.. 8 తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుండటం తెలిసిందే.