Delhi Violence: కాల్పులు జ‌రిపిన‌ సోనూ చిక్నా అరెస్ట్.. ఢిల్లీ అల్లర్ల కేసులో చురుగ్గా పోలీసుల దర్యాప్తు..

ఢిల్లీ జహంగీర్‌పురి అల్లర్ల వ్యవహారంలో విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌ నేతలపై కూడా కేసు నమోదయ్యింది. హనుమాన్‌ జయంతి నాడు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని..

Delhi Violence: కాల్పులు జ‌రిపిన‌ సోనూ చిక్నా అరెస్ట్.. ఢిల్లీ అల్లర్ల కేసులో చురుగ్గా పోలీసుల దర్యాప్తు..
Sonu Chikna
Follow us

|

Updated on: Apr 18, 2022 | 8:55 PM

ఢిల్లీ జహంగీర్‌పురి అల్లర్ల వ్యవహారంలో విశ్వహిందూపరిషత్‌(VHP), భజరంగదళ్‌ నేతలపై కూడా కేసు నమోదయ్యింది. హనుమాన్‌ జయంతి నాడు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఢిల్లీ అల్లర్ల కేసులో 23 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హనుమాన్‌జయంతి రోజున ఢిల్లీలోని జ‌హంగిర్‌పుర్‌లో రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్నాయి. అరెస్టయిన వారిలో 8 మందికి నేర చ‌రిత్ర ఉంది. దోషిగా తేలిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఢిల్లీ సీపీ రాకేశ్ ఆస్తానా తెలిపారు. అయితే మ‌రోసారి జ‌హంగిర్‌పుర్‌లో హింస చెల‌రేగింది. ఏప్రిల్ 16వ తేదీన జ‌హంగిర్‌పుర్‌లో ఓ వ్య‌క్తి కాల్పులు జ‌రుపుతున్న వీడియో వైర‌ల్ అయ్యింది. ఆ వీడియోతో లింకున్న వ్య‌క్తిని ప్ర‌శ్నించేందుకు సీడీ పార్క్‌లో ఉన్న అత‌నికి ఇంటికి వెళ్లారు. ఆ వ్య‌క్తి కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌పై రాళ్లతో దాడి చేశారు.

హనుమాన్‌జయంతి ర్యాలీ సందర్భంగా సోనూ చిక్నా(SONU CHIKNA) అనే వ్య‌క్తి కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు గుర్తించారు. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, ఒక‌ర్ని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం జ‌హంగిర్‌పురిలో ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు తెలిపారు. 14 బృందాలుగా పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా శాంతికి భంగం క‌లిస్తున్న వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. అరెస్టు అయిన వారి నుంచి అయిదు తుపాకులు, అయిదు క‌త్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు. అస్ల‌మ్ అనే వ్య‌క్తి నుంచి దేశీయ తుపాకీని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

హ‌నుమాన్ జ‌యంతి ఊరేగింపు స‌మ‌యంలో మ‌సీదు దగ్గర కాషాయ జెండాను ఎగుర‌వేసేందుకు ఎటువంటి ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేద‌ని ఢిల్లీ పోలీసు చీఫ్ స్పష్టం చేశారు. ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. ఒకే వర్గంపై పోలీసులు కేసులు పెట్టారని విమర్శించారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులే చెబుతున్నారని, నిర్వాహకులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు.

జహంగీర్‌పురిలో హనుమాన్‌జయంతి నాడు మొత్తం మూడు ర్యాలీలు నిర్వహించారని, అందులో రెండు ర్యాలీలకు మాత్రమే అనుమతిచ్చామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: Stock Market: రూ. 2.56 లక్షల కోట్ల సంపద క్షణాల్లో ఆవిరి.. భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్‌ షేర్లు..

Metro Trains: మెట్రో బాట పట్టిన భాగ్యనగర వాసులు.. ఆర్టీసీ చార్జీల మోతతో పెరిగిన రద్దీ..

Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..