Delhi Pollution: డేంజర్‌ జోన్‌లో ఢిల్లీ ప్రజలు.. పెరుగుతున్న కళ్లు మంటలు, గొంతు నొప్పి కేసులు

|

Nov 16, 2021 | 5:59 AM

Delhi Pollution: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య వారంలో 22 శాతం నుంచి 44 శాతానికి పెరిగింది. అయితే ఈ ప్రాంతంలోని ప్రజలు

Delhi Pollution: డేంజర్‌ జోన్‌లో ఢిల్లీ ప్రజలు.. పెరుగుతున్న కళ్లు మంటలు, గొంతు నొప్పి కేసులు
Pollution
Follow us on

Delhi Pollution: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య వారంలో 22 శాతం నుంచి 44 శాతానికి పెరిగింది. అయితే ఈ ప్రాంతంలోని ప్రజలు కాలుష్యం తగ్గించడానికి మూడు రోజుల లాక్‌డౌన్ విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జరిగిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. రెండో వారంలో వాయు కాలుష్యం అధికంగా పెరిగింది. ప్రజల పరిస్థితి మరింత దిగజారింది.

86 శాతం ఢిల్లీ-ఎన్‌సిసిఆర్ కుటుంబాలలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు విషపూరిత గాలి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 56 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిలో గొంతునొప్పి, కఫం, గొంతు బొంగురుపోవడం, కళ్ల మంటలు వంటి సమస్యలు ఉన్నాయి. ఈ సర్వేలో ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లకు చెందిన 25000 మందికి పైగా ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ నగరాల్లో గాలి నాణ్యత సూచిక 300-1000 మధ్య ఉంది. సర్వే ప్రకారం.. ” గత రెండు వారాల్లో డాక్టర్ లేదా ఆసుపత్రిని సందర్శించే వారి శాతం రెండింతలు పెరిగింది. సహాయం కోరే కుటుంబాలు 22 శాతం నుంచి 44 శాతానికి పెరిగాయి.

లాక్‌డౌన్‌పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు
సర్వే ప్రకారం.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మూడు రోజుల లాక్‌డౌన్ విధించే విషయంపై ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. AQI ఎక్కువగా ఉండటానికి కారణం పొట్టలు కాల్చడం. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సర్వే ప్రకారం.. పొట్టను తగులబెట్టడం అనేదానికి ఏమీ చేయలేమని అయితే లాక్‌డౌన్‌ వల్ల వాహనాల నుంచి వచ్చే కాలుష్యం తగ్గుతుందని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే వాయు కాలుష్యానికి మునిసిపల్ కార్పొరేషన్లను బాధ్యులను చేయడంపై సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని మందలించింది. ఇలాంటి తప్పుడు సాకులు చెప్పొద్దని హెచ్చరించింది.

గోవాలోని నిశ్శబ్ద బీచ్‌లని ఎప్పుడైనా సందర్శించారా..! ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళుతారు..

నవగ్రహాల అనుగ్రహం లభించాలంటే వీటిని దానం చేయాల్సిందే..! అప్పుడే శుభపరిణామాలు..

T20 World Cup 2021: న్యూజిలాండ్ చేతిలో నుంచి టైటిల్ ఎందుకు జారిపోయింది.. కివీస్‌ చేసిన తప్పేంటో తెలుసా..?