Air Pollution: పెరుగుతున్న కాలుష్యంపై కేంద్రం సంచలన నిర్ణయం.. జనవరి 1 ఆంక్షలు

|

Dec 29, 2022 | 3:53 PM

అక్కడ కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మరో..

Air Pollution: పెరుగుతున్న కాలుష్యంపై కేంద్రం సంచలన నిర్ణయం.. జనవరి 1 ఆంక్షలు
Air Polluation
Follow us on

అక్కడ కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మరో ముందుడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం కఠినంగా వ్యవహరిస్తోంది. కాలుష్యాన్ని నివారించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఎక్కడో అనుకుంటున్నారా? ఢిల్లీలో. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో బొగ్గు, ఇతర నిషేధిత ఇంధనాలను ఉపయోగించే పరిశ్రమలను జనవరి 1 నుండి మూసివేస్తామని, వాటిపై భారీ జరిమానాలు కూడా విధిస్తామని కేంద్ర ఎయిర్ క్వాలిటీ కమిషన్ బుధవారం తెలిపింది. అయితే పవర్ స్టేషన్లలో తక్కువ సల్ఫర్ బొగ్గు వినియోగానికి అనుమతి ఉంటుంది. వాస్తవానికి ఢిల్లీ -ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత నిరంతర పెరుగుతున్న కారణంగా ప్రభుత్వాలు నిరంతరం కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. కాలుష్యాన్ని పెంచే అన్ని కార్యకలాపాలను నియంత్రిస్తాయి.

బొగ్గుతో సహా అనుమతి లేని ఇంధనాలను వినియోగించే పరిశ్రమలు, వాణిజ్య సంస్థలను వెంటనే మూసివేయాలని కాలుష్య నియంత్రణ అధికారులను ఆదేశించినట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం వారి నుంచి గరిష్టంగా జరిమానా వసూలు చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ అవసరాల కోసం పవర్ ప్లాంట్లు తక్కువ సల్ఫర్ బొగ్గును ఉపయోగించేందుకు అనుమతిస్తామని అధికారి స్పష్టం చేశారు. ఇది విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించవచ్చు.

కలప, జీవ ఇంధనాన్ని మతపరమైన అవసరాలకు, దహన సంస్కారాలకు ఉపయోగించవచ్చు. చెక్క లేదా వెదురు బొగ్గును హోటళ్లు, రెస్టారెంట్లు, బాంకెట్ హాల్స్ (ఉద్గార నియంత్రణ వ్యవస్థలతో), ఓపెన్ తినుబండారాలు లేదా ధాబాలలో ఉపయోగించవచ్చు. ఈ ఏడాది జూన్‌లో జాతీయ రాజధాని ఢిల్లీలో 2023 జనవరి 1 నుండి పరిశ్రమ, గృహ, ఇతర అవసరాలలో బొగ్గు వినియోగాన్ని నిషేధించాలని కమిషన్ ఆదేశించింది. ఒక అంచనా ప్రకారం.. ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో (ఎన్‌సీఆర్‌) వివిధ పారిశ్రామిక పనులలో సంవత్సరానికి 17 లక్షల టన్నుల బొగ్గు ఉపయోగించబడుతుంది. ఇందులో ఆరు పెద్ద పారిశ్రామిక జిల్లాల్లో 14 లక్షల టన్నులు వినియోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి