ఓరి మీ పాసుగాలా.. ఇదేం పనిరా..! దెబ్బకు మెట్రోనే అతలాకుతలం అయింది..

|

Dec 05, 2024 | 10:42 AM

మోతీనగర్ - కీర్తినగర్ మధ్య కేబుల్ దొంగతనం కారణంగా ఢిల్లీ మెట్రో సేవలకు అంతరాయం కలిగిందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఢిల్లీ మెట్రో బ్లూ లైన్ సేవల్తో అంతరాయం ఏర్పడింది.. బ్లూలైన్ లో కేబుల్ వైర్ చోరీ జరగడంతో ఈరోజు ఈ మార్గంలో మెట్రో నెమ్మదిగా నడుస్తుందని అధికారులు తెలిపారు. 

ఓరి మీ పాసుగాలా.. ఇదేం పనిరా..! దెబ్బకు మెట్రోనే అతలాకుతలం అయింది..
Delhi Metro
Follow us on

ఢిల్లీ మెట్రో.. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు.. ఉదయం నుంచి రాత్రి వరకు నాన్ స్టాప్ మెట్రో సర్వీసుల ద్వారా మెట్రో ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రద్దీ భీకరంగా ఉంటుంది. దేశరాజధానిలోని మెట్రో ఢిల్లీ NCR అంతటా విస్తరించి ఉంది.. ఇది ఢిల్లీతోపాటు.. దాని పొరుగున ఉన్న గుర్గావ్, ఫరీదాబాద్, నోయిడాలకు కనెక్టివిటీ ఉంది.. ఎప్పుడూ వేలాది మందితో స్టేషన్లు అన్ని కిటకిటలాడుతుంటాయి.. అయితే.. తాజాగా.. జరిగిన ఓ చోరీ ఘటనతో ఢిల్లీ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది.. కొందరు దొంగలు.. ఏకంగా మెట్రో రైలు కేబుల్ వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లడం కలకలం రేపింది..

మోతీనగర్ – కీర్తినగర్ మధ్య కేబుల్ దొంగతనం కారణంగా ఢిల్లీ మెట్రో సేవలకు అంతరాయం కలిగిందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఢిల్లీ మెట్రో బ్లూ లైన్ సేవల్తో అంతరాయం ఏర్పడింది.. బ్లూలైన్ లో కేబుల్ వైర్ చోరీ జరగడంతో ఈరోజు ఈ మార్గంలో మెట్రో నెమ్మదిగా నడుస్తుందని అధికారులు తెలిపారు.

మోతీ నగర్ – కీర్తి నగర్ మధ్య బ్లూ లైన్‌లో కేబుల్ చోరీ జరిగిందని.. ఈ సమస్య రాత్రి మెట్రో ఆపరేషన్ ముగిసిన తర్వాత మాత్రమే పరిష్కారమవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. రైళ్లు నెమ్మదిగా నడుస్తాయని.. సర్వీసుల్లో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని మెట్రో అధికారులు కోరారు. మెట్రో స్పీడ్ నెమ్మదించడం వల్ల బ్లూ లైన్‌లో ప్రయాణికులు చాలా సేపు నిరీక్షించాల్సి వస్తోంది. దీనిని ఢిల్లీ మెట్రో అత్యంత రద్దీ మార్గం అని కూడా పిలుస్తారు.

మెట్రో ట్వీట్..

మోతీ నగర్ – కీర్తి నగర్ మధ్య కేబుల్ దొంగతనం కారణంగా బ్లూ లైన్‌లో సేవలు ఆలస్యం అవుతోందని DMRC ట్విట్టర్‌లో రాసింది. అసౌకర్యానికి క్షమించండి. మోతీ నగర్ – కీర్తి నగర్ మధ్య బ్లూ లైన్‌లో కేబుల్ చోరీ సమస్య రాత్రి పనివేళలు ముగిసిన తర్వాత మాత్రమే పరిష్కరించబడుతుంది. పగటిపూట ప్రభావిత విభాగంలో రైళ్లు పరిమిత వేగంతో నడుస్తాయి.. కాబట్టి, సర్వీసుల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. ప్రయాణానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అభ్యర్థించారు.

పూర్తయిన సొరంగం పనులు..

మరో వార్తలో, ఫేజ్-IVలోని తుగ్లకాబాద్-ఏరోసిటీ కారిడార్‌లో తుగ్లకాబాద్ ఎయిర్ ఫోర్స్ లాంచింగ్ షాఫ్ట్, మా ఆనందమయి మార్గ్ మధ్య పొడవైన సొరంగం పనిని DMRC బుధవారం పూర్తి చేసింది. మా ఆనందమయి మార్గ్ స్టేషన్‌లో 2.65 కి.మీ పొడవైన సొరంగం తవ్విన తర్వాత 105 మీటర్ల పొడవైన టన్నెల్ బోరింగ్ మెషిన్ (టిబిఎం) చెడిపోయిందని ప్రకటన పేర్కొంది. ఏరోసిటీ-తుగ్లకాబాద్ కారిడార్‌లో భాగంగా ఈ విభాగంలో పైకి క్రిందికి వెళ్లేందుకు రెండు సమాంతర సొరంగాలు నిర్మిస్తున్నారు. కొత్త సొరంగం సగటున 16 మీటర్ల లోతులో నిర్మించారు.. సొరంగంలో సుమారు 1,894 రింగులను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..