పార్లమెంట్ వద్ద కలకలం.. లోనికి వెళ్లేందుకు యత్నించిన దుండగుడు

| Edited By:

Sep 02, 2019 | 1:13 PM

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కలకలం రేగింది. పార్లమెంట్‌లోనికి ఓ దుండగుడు కత్తితో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పార్లమెంట్ పోలీసు స్టేషన్‌కు అతడిని తరలించి విచారిస్తున్నారు. అతడిని స్థానిక లక్ష్మీ నగర్‌కు చెందిన సాగర్ ఇన్సాగా గుర్తించారు. వివాదాస్పద బాబా, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఇతడు అనుచరుడని పోలీసులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా […]

పార్లమెంట్ వద్ద కలకలం.. లోనికి వెళ్లేందుకు యత్నించిన దుండగుడు
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కలకలం రేగింది. పార్లమెంట్‌లోనికి ఓ దుండగుడు కత్తితో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పార్లమెంట్ పోలీసు స్టేషన్‌కు అతడిని తరలించి విచారిస్తున్నారు. అతడిని స్థానిక లక్ష్మీ నగర్‌కు చెందిన సాగర్ ఇన్సాగా గుర్తించారు. వివాదాస్పద బాబా, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఇతడు అనుచరుడని పోలీసులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా పార్లమెంట్ వద్ద పోలీసులు నిఘా పెంచారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఓ కారు ఇలాగే కలకలం రేపింది. 2001లో ఉగ్రవాదులు చొరబడిన ద్వారం నుంచి లోపలికి వెళ్లిన ఓ కారు బారికేడ్లను దాటి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించబోయింది. దాంతో అప్రమత్తమైన అధికారులు స్పైక్స్ యాక్టివేట్ చేయడంతో.. కారు బంపర్ దెబ్బతిని అక్కడే నిలిచిపోయింది. అయితే ఆ కారు మణిపూర్ ఎంపీ, కాంగ్రెస్ నేత డాక్టర్ థోక్చోమ్‌కు చెందినదని ఆ తర్వాత తెలిసింది. ఆ సమయంలో ఆయన కారులో లేరు. పార్లమెంటులో ప్రవేశానికి అనుమతి లేని ద్వారం గుండా కారు లోపలికి రావడంతో కలకలం రేగింది.