Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. మాగుంట రాఘవకు బెయిల్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కాగా, గతంలో బెయిల్ మంజూరు చేయడంపై...

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. మాగుంట రాఘవకు బెయిల్..
Delhi Liquor Scam

Updated on: Jul 18, 2023 | 11:43 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కాగా, గతంలో బెయిల్ మంజూరు చేయడంపై అభ్యంతరం తెలిపిన ఈడీ.. ఈసారి మాత్రం ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినేష్ అరోరా.. అప్రూవర్‌గా మారాడు. మరోవైపు ఇటీవలే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా, మరికొందరి ఆస్తులను ఈడీ అటాక్ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..