ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వరుసగా తెలుగువాళ్లు అరెస్ట్ అవుతుండడం సంచలనంగా మారింది. తాజాగా అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు నిందితులను ఈడీ అరెస్ట్ చేయగా, ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో వినయ్ బాబు అనే వ్యక్తిని ఈడీ అరెస్ట్ చేసింది. శరత్ చంద్రారెడ్డితో పాటు వినయ్‌బాబు అరెస్ట్ చేశారు. కాసేపట్లో వీళ్లిద్దరినీ రిమాండ్‌కు తరలించనున్నారు. సెప్టెంబర్‌లో శరత్‌చంద్రారెడ్డిని ప్రశ్నించారు. అయితే జాతా ఆయనను ఇవాళ అరెస్టు చేశారు. అసలు ఈ కేసులో ఆయన పాత్రపై ఎలాంటి ఆధారాలు దొరికాయి.. విచారణలో కొత్త విషయాలు ఏం వెలుగులోకి వచ్చాయి. లిక్కర్‌స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ దూకుడుగానే ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో సమీర్ మహేంద్రు, అభిషేక్‌రావు, విజయ్ నాయర్, దినేశ్ అరోరాను అరెస్టు చేశారు. అప్రూవర్ దినేశ్ అరోరా స్టేట్‌మెంట్‌తో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం కనిపిస్తోంది. రాబిన్ డిస్టిలరీస్ అభిషేక్‌రావుతో ప్రముఖులకు లింక్‌లు బయటపడడంతో ఇటీవలే వరుసగా ఆడిటర్లు సహా మరికొందరి ఇళ్లలో సోదాలు జరిగాయి.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ED, CBI అరెస్టు చేసిన వ్యక్తులలో వినయ్ బాబు, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయిన్‌పిళ్లై, విజయ్ నాయర్, శరత్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో నిందితుడైన దినేష్ అరోరా కోర్టులో దరఖాస్తు చేయడం ద్వారా ప్రభుత్వ సాక్షిగా మారాలని కోరారు.
వీళ్ల కాల్‌డేటా, అకౌంట్స్‌ను కూడా దర్యాప్తు బృందాలు విశ్లేషిస్తున్నాయి. అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరా స్టేట్మెంట్‌తో త్వరలో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ అరెస్టైన శరత్ చంద్రారెడ్డిని సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో సుదీర్ఘంగా విచారించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అరెస్టు చేశారు. అరబిందో గ్రూపులో డైరెక్టర్‌గా ఉన్నారు పిన్నాక శరత్ చంద్రారెడ్డి.
గ్రూప్‌లోని 12 కంపెనీలకు డైరెక్టరుగా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఉండడం.. ఆ కంపెనీ పేరు ఈ లిక్కర్ స్కామ్ కేసులో A5గా ఉండడంతో విచారణ కీలక మలుపు తిరిగినట్టు అయ్యింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెనాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది సీబిఐ. ఆ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్టు శరత్ చంద్రారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌లో CBI ఎఫ్‌ఐఆర్‌లో A-8గా పెనాక శరత్ చంద్రారెడ్డి ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం