ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. అయితే కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు తిహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టులో షాక్ తగిలింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. వైద్య పరీక్షల కోసం వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన అభ్యర్ధించారు . అయితే జైల్లోనే కేజ్రీవాల్‌కు అన్ని వైద్యపరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతకుముందు సుప్రీంకోర్టులో కూడా కేజ్రీవాల్‌కు ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్‌ను వారం రోజుల పాటు పొడిగించాలన్న ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇప్పుడు ట్రయల్ కోర్టు కూడా బెయిల్ నిరాకరించింది.
కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం ఈనెల 19వ తేదీ వరకు పొడిగించింది. కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయమూర్తి తిహార్ జైలు అధికారులను ఆదేశించారు. కిడ్నీ సమస్యలతో పాటు, షుగర్ సమస్యలు ఉన్నాయని బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు కేజ్రీవాల్. లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. తాజా ఎన్నికల్లో కూడా ఢిల్లీలో ఒక్క స్థానాన్ని గెలుచుకోని ఆప్ పంజాబ్‌లో మాత్రం 3 సీట్లతో సరిపెట్టుకుంది. ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్ ఇదివరకే అవకాశం ఇచ్చినందున ఈ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెలిపింది. దీంతో ఆయన జూన్ 2న మధ్యాహ్నం లొంగిపోయారు. మరోవైపు కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…