
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఫరీదాబాద్‌కు చెందిన డాక్టర్ షాహీన్ షాహిద్‌తో సహా అనేక మంది అరెస్టులు జరిగాయి. ఆమెకు భారతదేశంలో జైష్-ఎ-మొహమ్మద్ మహిళా విభాగం, జమాత్-ఉల్-మోమినీన్‌కు కమాండ్‌గా అప్పగించిందని భద్రతా సంస్థలు వెల్లడించాయి.
ఈ కారు బాంబు పేలుడులో మరణించిన, గాయపడిన, తీవ్రంగా గాయపడిన వారికి ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన దురదృష్టకర సంఘటన మొత్తం నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా సోషల్ మీడియా X వేదికగా రాశారు. ఈ క్లిష్ట సమయంలో, ఈ సంఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని పేర్కొన్నారు.
బాంబు దాడి బాధిత ప్రతి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి సున్నితమైన నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా రాశారు. ఈ సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, శాశ్వతంగా వికలాంగులైన వారికి 5 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు అందుతాయి. గాయపడిన వారికి సరైన, నాణ్యమైన చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ శాంతి భద్రతలకు ప్రధాన ప్రాధాన్యత, అధికార యంత్రాంగం శ్రద్ధగా పనిచేస్తోంది. బాధిత ప్రజలందరికీ, వారి కుటుంబాలకు అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా పేర్కొన్నారు.
दिल्ली में हुई दुर्भाग्यपूर्ण घटना ने पूरे शहर को स्तब्ध कर दिया है। इस मुश्किल की घड़ी में दिल्ली सरकार की गहरी संवेदनाएँ उन सभी परिवारों के साथ हैं जिन्होंने अपने प्रियजनों को खोया है और जो इस घटना में घायल हुए हैं।
दिल्ली सरकार हर पीड़ित परिवार के साथ मज़बूती से खड़ी है और…
— Rekha Gupta (@gupta_rekha) November 11, 2025
వీటన్నింటి మధ్య, భద్రతా కారణాల దృష్ట్యా, నవంబర్ 12న ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలియజేసింది. మిగతా అన్ని స్టేషన్లు సాధారణంగా పనిచేస్తున్నాయన వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..