Rahul Gandhi: రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోండి.. ఢిల్లీ హైకోర్ట్ కీలక ఆదేశాలు..

కాంగ్రెస్ పార్టీ యువనేత వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టులో పెద్ద షాక్ తగిలింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీలను 'పిక్ పాకెటర్స్' అన్న విషయం మనకు తెలిసిందే. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ నేతలు. ఈ పిటిషన్ పై గత కొన్ని నెలలుగా వాదనలు వినిపిస్తూనే ఉన్నారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోండి.. ఢిల్లీ హైకోర్ట్ కీలక ఆదేశాలు..
Rahul Gandhi

Updated on: Dec 21, 2023 | 8:32 PM

కాంగ్రెస్ పార్టీ యువనేత వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టులో పెద్ద షాక్ తగిలింది. గతంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీలను ‘పిక్ పాకెటర్స్’ అని విమర్శించారు. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ నేతలు. ఈ పిటిషన్ పై గత కొన్ని నెలలుగా వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలా తప్పుగా అభివర్ణించినందుకు రాహుల గాంధీపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సీఈవోని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ తరఫున వివిధ రకాలా వాదనలు వినిపించారు లాయర్లు. అయితే వారి వాదనలతో ఏకీభవించని ధర్మాసనం రాహుల్ వ్యాఖ్యలు సరిగాలేవని పేర్కొంది. నవంబర్ 22న రాజకీయ ప్రచారంలో ప్రముఖ పారిశ్రమిక, రాజకీయ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాహుల్. దానిపై వివరణ ఇవ్వాలని నవంబర్ 23న ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు రాహుల్.

దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశించింది. ఇదిలా ఉంటే ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తున్నందున ఇందులో ఢిల్లీ ఎన్నికల సంఘం జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఢిల్లీ హైకోర్టు ఫలానా చర్యలు తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయని నేపథ్యంలో ఈసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..