ఆ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

|

Feb 25, 2021 | 8:00 AM

ఢిల్లీ పరిధిలోని స్కూళ్లలో 2020‌-21 విద్యాసంవత్సరంలో మూడవ తరగతి మొదలుకొని 8వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు ఆఫ్‌లైన్ పరీక్షలు ఉండవని స్పష్టం చేసింది.

ఆ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
Follow us on

Delhi government schools : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులో భాగంగా విద్యపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఉన్నత పాఠశాలలతో పాటు ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ తరగతుల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పిల్లలను పాఠశాలలకు, కళాశాలలకు పంపించే విషయంలో తల్లిదండ్రులదే తుది నిర్ణయంగా తేల్చింది. వారి లిఖితపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది. అయితే, మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో పిల్లలు చదువులకు దూరమవుతారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ పరిధిలోని స్కూళ్లలో 2020‌-21 విద్యాసంవత్సరంలో మూడవ తరగతి మొదలుకొని 8వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు ఆఫ్‌లైన్ పరీక్షలు ఉండవని స్పష్టం చేసింది. ఈసారి ఈ తరగతుల విద్యార్థులకు అందించిన వర్క్‌షీట్, అసైన్‌మెంట్‌ల ఆధారంగా వారికి మార్కులు(గ్రేడు) ఇవ్వాలని భావిస్తోంది. ఇదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాసంవత్సరం 2020 21లో నర్సరీ మొదలుకొని 2వ తరగతి వరకూ చదువున్న విద్యార్థుందరినీ తదుపరి తరగతులకు నేరుగా ప్రమోట్ చేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. 8వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులందరినీ డిస్టెన్స్ పాలసీ ఆధారంగా తదుపరి తరగతులకు ప్రమోట్ చేయనున్నమన్నారు. అయితే, ఈ ఏడాది సెమీ ఆన్‌లైన్ క్లాసులలో ఏమి నేర్చుకున్నారనేది తెలుసుకోవాలని, ఇది తాము తదుపరి విద్యాసంవత్సరాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందన్నారు.


ఇదిలావుంటే, కరోనా కారణంగా గత ఏడాది పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్ చేసింది. ఇంటర్నల్ మార్క్‌లు, అటెండెన్స్ ఆధారంగా గ్రేడ్‌లు కేటాయించారు. అయితే, ఈసారి కూడా క్లాసులు జరగడంలేదు. అయితే, సాధారణంగా ప్రతి ఏటా మార్చి చివరి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. అందుకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈసారైనా పరీక్షలు జరుగుతుతాయా? లేదా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే పరీక్షలపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండిః