బ్రేకింగ్.. కుప్పకూలిన కోచింగ్ సెంటర్.. ఐదుగురు మృతి..

| Edited By:

Jan 25, 2020 | 8:05 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భజన్ పూరా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బహుల అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఈ బిల్డింగ్‌లో ఓ కోచింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు. బిల్డింగ్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో.. కోచింగ్ సెంటర్‌లో ఉన్న సిబ్బందితో పాటు పదుల సంఖ్యలో ఉన్న స్టుడెంట్స్.. శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 13 మందిని.. […]

బ్రేకింగ్.. కుప్పకూలిన కోచింగ్ సెంటర్.. ఐదుగురు మృతి..
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భజన్ పూరా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బహుల అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఈ బిల్డింగ్‌లో ఓ కోచింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు. బిల్డింగ్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో.. కోచింగ్ సెంటర్‌లో ఉన్న సిబ్బందితో పాటు పదుల సంఖ్యలో ఉన్న స్టుడెంట్స్.. శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 13 మందిని.. బయటకు తీసి.. సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు మరణించారు. వీరిలో నలుగురు విద్యార్ధులు ఉన్నట్లు గుర్తించారు. మరింత మంది కూడా శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం ఇంకా సహాయక చర్యలు చేపడతున్నారు. ఘటన జరగడానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.