ఢిల్లీలో ‘ఆయిల్‌ రైన్‌’.. అగ్నిమాపక శాఖకు పోటెత్తిన ఫోన్లు

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం చెదురుమదులు వర్షాలు పడ్డ విషయం తెలిసిందే. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 8:37 am, Mon, 16 November 20
ఢిల్లీలో 'ఆయిల్‌ రైన్‌'.. అగ్నిమాపక శాఖకు పోటెత్తిన ఫోన్లు

Delhi oil Rain: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం చెదురుమదులు వర్షాలు పడ్డ విషయం తెలిసిందే. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే వర్షం వస్తోన్న సమయంలో ఢిల్లీలోని అగ్నిమాపక శాఖకు ఫోన్లు పోటెత్తాయి. తమ ప్రాంతంలో పడుతున్న వర్షంలో ఆయిల్ తరహా పదార్ధం పడుతుందని కొంతమంది ఫోన్ చేశారు. వారిలో ఎక్కువగా బైకర్లు ఉన్నారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. తాము వెళుతుంటే రోడ్డుపై ఆయిల్ తరహా పదార్థం ఉందని, దీంతో రోడ్డుపై జారుతున్నట్లుగా అనిపించిందని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలా దాదాపు 55 ఫోన్ కాల్‌లు తమకు వచ్చినట్లు వివరించారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు తాము వెళ్లామని, కానీ తమకు ఎక్కడా అలాంటి పదార్థం కనిపించలేదని వెల్లడించారు.

Read More:

కరోనాతో హర్యానా మొదటి మహిళా ఎంపీ చంద్రావతి దేవి కన్నుమూత

గంజాయి మత్తులో యువకుడిపై మైనర్ బాలుడు కత్తితో దాడి.. పరిస్థితి విషమం