Farmers Protest – Delhi Police: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు రెండు నెలలపైనుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం నాడు రాజధానిలో జరిగిన హింసాకాండ అనంతరం 200మంది పోలీసులు తమ విధులకు రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సోమవారం ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇది అసత్య ప్రచారం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాన్ని ఖండించారు. తప్పుడు ప్రచారంపై కేసునమోదు చేసి సైబర్ సెల్ పోలీసులు రాజస్థాన్‌లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సిబ్బంది ఎవరూ రాజీనామా చేయలేదని పోలీసులు తెలిపారు.
రాజస్థాన్ లోని చురు జిల్లాకు చెందిన ఓం ప్రకాష్ ధేతర్వాల్ ‘కిసాన్ ఆందోళన్ రాజస్థాన్’ పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించి పాత వీడియోను షేర్ చేశాడని.. దానిని రైతు ఆందోళనలపై ఢిల్లీ పోలీసు సిబ్బంది స్పందనంటూ అసత్వ ప్రచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఆయన్ను అరెస్టు చేశామని.. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Also Read:
Farmers Protest: రైతులను తీసుకువెళ్తున్న రైళ్లను దారి మళ్లిస్తున్నారు, అన్నదాతల సంఘాల ఆగ్రహం.