Aravind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానానికి సిద్ధమైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

|

Feb 16, 2024 | 5:09 PM

సీఎం కేజ్రీవాల్ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు ‘ఈరోజు నేను అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెడతాను’ అని రాశారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలనుకున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ప్రసంగానికి చాలాసార్లు అంతరాయం కలిగించారు.

Aravind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానానికి సిద్ధమైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
Aravid Kejriwal
Follow us on

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. నిజానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దీంతో సీఎం కేజ్రీవాల్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారం వరకు పొడిగించిన సంగతి తెలిసిందే..!

సీఎం కేజ్రీవాల్ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు ‘ఈరోజు నేను అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెడతాను’ అని రాశారు.

దీంతో అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై శనివారం చర్చ జరగనుంది. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పుడు కేసుల్లో ఇరికించి పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని కూల్చడం ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను వేటాడేందుకు ప్రయత్నాలు జరిగాయని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఎక్సైజ్ పాలసీ విషయంలో ఎలాంటి కుంభకోణం జరగలేదన్నారు. ఢిల్లీలో మద్యం కుంభకోణం ముసుగులో అరెస్టు చేయడమే బీజేపీ లక్ష్యం అని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టడమే వారి లక్ష్యమని మండిపడ్డారు. ఈ సభకు మంత్రి మండలిపై విశ్వాసం ఉందని ప్రజలకు చూపించడానికే, మేము విశ్వాస ఓటును ప్రతిపాదించామని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలనుకున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ప్రసంగానికి చాలాసార్లు అంతరాయం కలిగించారు. ఈ నేపథ్యంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగించినందుకు ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలను ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మిగిలిన కాలానికి సస్పెండ్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ కూడా ప్రివిలేజెస్ కమిటీకి పంపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దిలీప్ పాండే ఈ అంశంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిని అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు.

గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి విపక్ష సభ్యులు అంతరాయం కలిగించారు. తద్వారా సభ గౌరవానికి భంగం వాటిల్లిందని దిలీప్ పాండే అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇది దురదృష్టకరం అని, రూల్ బుక్ చదువుతూ విపక్ష సభ్యుల తీరు సభ గౌరవాన్ని దెబ్బతీసిందని, వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గోయల్ పాండే ప్రతిపాదనను ఆమోదించి, ఈ అంశాన్ని ప్రివిలేజెస్ కమిటీకి పంపాలని చెప్పారు. కమిటీ నివేదిక వచ్చే వరకు ప్రతిపక్ష నేత రాంవీర్ సింగ్ బిధూరి మినహా ఏడుగురు బీజేపీ సభ్యులను సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేశారు.

దీని తర్వాత ఏడుగురు ఎమ్మెల్యేలు మోహన్ సింగ్ బిష్త్, అజయ్ మహావార్, ఓపీ శర్మ, అభయ్ వర్మ, అనిల్ వాజ్‌పేయి, జితేంద్ర మహాజన్, విజేంద్ర గుప్తాలను శాసనసభ నుంచి బయటకు వెళ్లాలని గోయల్ కోరారు. దీనికి నిరసనగా ప్రతిపక్ష నేత బిధూరి సభ నుంచి వాకౌట్ చేశారు.

బడ్జెట్ సెషన్ మొదటి రోజు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగానికి పదే పదే అంతరాయం కలిగించినందుకు గోయల్ గురువారం బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ ద్వారా సభ నుంచి బయటకు పంపారు. సక్సేనా తన ప్రసంగాన్ని ప్రారంభించి, విద్యా రంగంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించినప్పుడు, బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ప్రతిపక్ష నాయకుడు విజేంద్ర గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 12 కళాశాలలకు నిధుల సమస్యను లేవనెత్తడం ద్వారా అతన్ని అడ్డుకున్నారని అసెంబ్లీ అధికారులు తెలిపారు. నీటి కొరత, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలుకాకపోవడం, ఆసుపత్రుల దుస్థితి, విద్యుత్‌ ధరలపై ప్రసంగం సందర్భంగా ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ప్రసంగానికి అంతరాయం కలిగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…