ఢిల్లీ పేలుడు కేసులో పాటియాలా కోర్టు కీలక నిర్ణయం.. మరో 10 రోజుల NIA కస్టడీకి నిందితులు!

ఢిల్లీ పేలుడు కేసులో నలుగురు నిందితులను కోర్టులో హాజరుపర్చింది జాతీయ దర్యాప్తు సంస్థ (NIA). డాక్టర్‌ ముజామ్మిల్‌, డాక్టర్‌ షహీన్‌, ఇర్ఫాన్‌ , ఆదిల్‌కు పాటియాలా హౌస్‌ కోర్టు NIA కస్టడీని మరో 10 రోజుల పాటు పొడిగించింది. ఢిల్లీ పేలుడు కేసులో ఇప్పటివరకు NIA 30 మంది డాక్టర్లను విచారించింది. ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ డాక్టర్‌ ఉమర్‌తో సంబంధాలు ఉన్న వాళ్లను విచారిస్తున్నారు.

ఢిల్లీ పేలుడు కేసులో పాటియాలా కోర్టు కీలక నిర్ణయం.. మరో 10 రోజుల NIA కస్టడీకి నిందితులు!
Patiala House Court

Updated on: Nov 29, 2025 | 9:13 PM

ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అల్‌ఫలా యూనివర్సిటీలో మరోసారి దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి. పేలుడు కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్‌ షహీన్‌ గదిలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ. 18 లక్షల నగదును సీజ్‌ చేశారు. పేలుడుకు ఉపయోగించిన కార్లను కొనడానికి డాక్టర్‌ షహీన్‌ డబ్బు సమకూర్చినట్టు గుర్తించారు. ఢిల్లీ పేలుడు కేసులో ఇప్పటివరకు NIA 30 మంది డాక్టర్లను విచారించింది. ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ డాక్టర్‌ ఉమర్‌తో సంబంధాలు ఉన్న వాళ్లను విచారిస్తున్నారు.

మరోవైపు ఢిల్లీ పేలుడు కేసులో నిందితులను NIA కోర్టులో హాజరుపర్చారు. డాక్టర్‌ ముజామ్మిల్‌ , డాక్టర్‌ షహీన్‌ , ఇర్ఫాన్‌ , ఆదిల్‌ను కోర్టులో హాజరుపర్చారు. 10 రోజుల పాటు నిందితులను విచారించిన తరువాత NIA అధికారులు కోర్టులో హాజరుపర్చారు. గట్టి భద్రత మధ్య నలుగురిని పాటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం నలుగురు నిందితులకు NIA కస్టడీని మరో 10 రోజుల పాటు పొడించింది. దేశవ్యాప్తంగా ఈ టెర్రర్‌ నెట్‌వర్క్‌ను NIA అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌ , గుజరాత్‌ , జమ్ముకశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వీళ్లకు సహకరించిన వాళ్లను విచారిస్తున్నారు. షహీన్‌ తన ప్రియురాలు కాదని , భార్య అని NIA విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు ముజామ్మిల్‌ . ఢిల్లీ పేలుడు ఘటన తరువాత స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పలు ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించారు. అక్కడ పనిచేస్తున్న విదేశీ డాక్టర్ల వివరాలు సేకరించారు. బంగ్లాదేశ్‌ , యూఏఈ , చైనాకు చెందిన వైద్యులపై నిఘా పెట్టారు

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us