దేశ రాజధాని ఢిల్లీలో ఊపిరి పీల్చుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హస్తినాలో వాయు కాలుష్యం లెవెల్స్ భారీగా పెరిగాయి. ఢిల్లీ అంతటా విషపూరిత పొగ మేఘాలు కమ్మేశాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో 418గా నమోదైంది. దాంతో, ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరిబిక్కిరి ఢిల్లీ ప్రజలు అవుతున్నారు. ముంబైలోనూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. AQI ఢిల్లీ స్థాయిలో లేకపోయినా క్రమంగా పెరుగుతున్న వాయుకాలుష్యంతో ఊపిరి ఆడని పరిస్థితి వస్తోంది. నెల రోజుల్లో శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రికి వెళ్తున్నవారి సంఖ్య 20 శాతం పెరిగింది.