IndiGo flight: గగనతలంలో ఇంజన్ ఫెయిల్.. ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..!

|

Jun 21, 2023 | 8:17 PM

అయితే, ఈ ఘటనపై ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ అయిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆప్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువలేదు. DGCA ప్రకటన అనంతరమే విమానంలో తలెత్తిన సమస్యకు గల కచ్చితమైన కారణం ఏమిటో తెలిసే అవకాశం ఉంది.

IndiGo flight: గగనతలంలో ఇంజన్ ఫెయిల్.. ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..!
Indigo Flight
Follow us on

భారత విమానయాన మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ క్రమంలోనే దేశంలోని అత్యంత ఎక్కువ ప్రయాణీకులు కలిగిన విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ ఇండియాకు గట్టి పోటీని ఇవ్వాలని యోచిస్తోంది. ఇండిగో 500 విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇండిగోకు సంబంధించిన మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇండిగో ప్యాసింజర్ విమానం గాల్లో ఎగురుతుండగానే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్‌కు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానంలో సమస్య వచ్చింది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC)ని సంప్రదించి సమాచారం ఇచ్చాడు. ఇంజిన్ వైఫల్యం కారణంగా ఢిల్లీలోని T2 విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది, అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనపై ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ అయిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆప్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువలేదు. DGCA ప్రకటన అనంతరమే విమానంలో తలెత్తిన సమస్యకు గల కచ్చితమైన కారణం ఏమిటో తెలిసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, అంతకుముందు, ఢిల్లీ-డెరాడూన్ ఇండిగో ఫ్లైట్ 6E 2134 ఇంజిన్ నెం. 2 గాలిలో ఉండగానే విమానంలో మంటలు చెలరేగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఎయిర్‌లైన్ దానిని ఖండించింది. అలాంటిదేదీ జరగలేదని చెప్పింది. ఇంజిన్‌లో లోపం ఉందని పేర్కొంది.

ఏవియేషన్ రెగ్యులేటర్ – డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) – ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఖచ్చితమైన కారణాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. మైసూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన అలియాంజ్ ఏటీ72-600 విమానం టేకాఫ్‌లో ఫ్యూయల్ ప్యానెల్ తెరవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన తర్వాత 24 గంటల్లో ఇది రెండో ఘటన.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..