లోథి ఎస్టేట్‌లో ప్రణబ్‌ అంత్యక్రియలు

| Edited By:

Sep 01, 2020 | 12:23 PM

ప్రణబ్‌ ముఖర్జీకి అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్డులోని శ్మశాన వాటికలో ప్రణబ్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. కేంద్రం ఏడు రోజుల్ని సంతాప దినాలు ప్రకటించింది.

లోథి ఎస్టేట్‌లో ప్రణబ్‌ అంత్యక్రియలు
Follow us on

ప్రణబ్‌ ముఖర్జీకి అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్డులోని శ్మశాన వాటికలో ప్రణబ్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. కేంద్రం ఏడు రోజుల్ని సంతాప దినాలు ప్రకటించింది.

ఉదయం 10.15 గంటల వరకు ప్రముఖులు రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాళులు అర్పించారు. వీరితో పాటు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ త్రివిధ దళాధిపతులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రణబ్‌ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ ప్రణబ్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇక ఉదయం 10.15 నుంచి 11 గంటల వరకు ఇతర ప్రముఖులు, 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు సాధారణ ప్రజలు ప్రణబ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

 

కరోనా కారణంగా భౌతికదూరం, వైద్యపరమైన నిబంధనలు అమల్లో ఉన్నందున ఆయన మృతదేహాన్ని గన్‌ క్యారేజ్‌పై కాకుండా సాధారణ అంబులెన్స్‌లోనే శ్మశాన వాటికకు తరలిస్తారు. కేంద్ర వైద్య ఆరోగ్య, హోంశాఖ జారీ చేసిన నిబంధనలు, ప్రొటో కాల్స్‌ను కఠినంగా అమలు చేయాలంటూ రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ప్రణబ్‌కు నివాళిగా రాష్ట్రపతి భవన్‌తో సహా అన్ని కార్యాలయాలపై జాతీయ జెండా అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్‌ అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్షణ శాఖ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది. సైనిక వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేసింది.