Robotic Dogs: భారత సైన్యంలోకి రోబోటిక్ డాగ్స్.. ఆర్మీ డే పరేడ్‌లో హైలైట్ ఇవే..!

| Edited By: Janardhan Veluru

Jan 15, 2025 | 3:40 PM

భారత సైన్యానికి పునాది 1 ఏప్రిల్ 1895న బ్రిటీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వేసింది. దీన్ని అప్పుడు ప్రెసిడెన్సీ ఆర్మీగా పిలిచేవారు. ఆ తరువాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీగా మార్చారు. స్వాతంత్ర్య వచ్చాక, భారత సైన్యంగా మారింది. స్వతంత్ర భారతదేశంలో, 15 జనవరి 1949న, భారత సైన్యం తన మొదటి భారత చీఫ్ జనరల్ KM కరియప్పను నియమించారు. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డే జరుపుకుంటారు.

Robotic Dogs: భారత సైన్యంలోకి రోబోటిక్ డాగ్స్.. ఆర్మీ డే పరేడ్‌లో హైలైట్ ఇవే..!
Robotic Mules Anti Drones Weapons
Follow us on

Indian Army Day Parade: ఇండియన్ ఆర్మీ డేని ప్రతియేటా జనవరి 15 న జరుపుకుంటారు. ఇది భారతీయ సైన్యం, శౌర్యపరాక్రమలకు, అంకితభావాన్ని గౌరవించే రోజు. ఈ నేపథ్యంలోనే భారత సైన్యంలోకి అత్యాధునిక మానవ రహిత సైన్యం అడుగు పెట్టబోతోంది. రోబోటిక్ డాగ్స్ తొలిసారిగా పుణెలో నిర్వహించిన ఆర్మీ డే పరేడ్‌లో పాల్గొన్నాయి. భారత సైన్యం ఇటీవల వాటిని LACలో మోహరించింది. రోబోటిక్ డాగ్స్ దేశ నియంత్రణ రేఖ వెంబడి అత్యంత అప్రమత్తంగా పని చేయగలవు.

ఉత్తర సరిహద్దులో మోహరించిన ఈ రోబోటిక్ మ్యూల్స్ థర్మల్ కెమెరాలు, సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి. ఇవి 30 కిలోల వరకు బరువును ఎత్తగలవు. 10 అడుగుల ఎత్తు వరకు ఎక్కగలవు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ మ్యూల్స్‌లో త్వరలో ఆయుధాలను కూడా అమర్చనున్నారు. ఈ రోబో మ్యూల్స్ సైన్యం బలాన్ని మరింత పెంచుతున్నాయి. ఎత్తులో ఉన్న కష్టతరమైన ప్రాంతాలలో ఇవి చాలా సహాయకారిగా ఉంటాయి. వీటిని ‘రోబోటిక్ మ్యూల్స్’ అని కూడా పిలుస్తారు. అంటే మల్టీ-యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్‌మెంట్. కవాతులో ఈ రోబోటిక్ మ్యూల్స్ ఉండటం భారతదేశ సైనిక సామర్థ్యాలను, ఆధునిక సాంకేతిక పురోగతిని ప్రదర్శిస్తుంది.

రోబోటిక్ మ్యూల్‌ను ఏ సీజన్‌లోనైనా ఉపయోగించవచ్చు. ఇవి బరువును మోయడమే కాదు, అవసరమైతే శత్రువుపై బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది. భారత సైన్యం నాల్గవ దశ ఎమర్జెన్సీ ప్రొక్యూర్‌మెంట్ (EP) (సెప్టెంబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 వరకు) కింద 100 రోబోటిక్ మ్యూల్స్‌ను కొనుగోలు చేసింది. వాటిని ఫార్వర్డ్ ప్రాంతాలలో మోహరించింది. పొరుగున ఉన్న చైనాను ఎదుర్కోవడానికి, తూర్పు లడఖ్‌లోని సైన్యం వివిధ పనుల కోసం, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల కోసం సాంకేతిక ఉత్పత్తుల కోసం వెతుకుతోంది. సైన్యం ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, స్వదేశీ రోబోటిక్ మ్యూల్ సృష్టించింది.

ఆర్మీ డే పరేడ్‌లో ప్రదర్శించిన రోబోటిక్ డాగ్స్

రోబోటిక్ మ్యూల్ అన్ని రకాల అడ్డంకులను అధిగమించగలదు. ఇది నీటి లోపలికి వెళ్లగలదు. నదులు, ప్రవాహాలను కూడా దాటగలదు. ఎలక్ట్రో-ఆప్టిక్స్, ఇన్‌ఫ్రారెడ్ వంటి వాటిని గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఇది మెట్లు, నిటారుగా ఉన్న కొండలు, ఇతర అడ్డంకులను సులభంగా దాటడమే కాకుండా -40 డిగ్రీల నుండి +55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలలో కూడా పనిచేయగలదు. అదనంగా, ఇది 15 కిలోల బరువును కూడా మోయగలదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..