
కేరళలో ఆదివారం రాత్రి జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ప్రాథమికంగా 9 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 21కి చేరింది. కేరళలోని మలప్పురం జిల్లా తానూర్‌లో టూరిస్టు బోటు బోల్తాపడిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. గల్లంతయిన వారి కోసం గజ ఈతగాళ్లతో సముద్రంలో గాలించారు.
ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 21 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరిందని కేరళ మంత్రి వీ.అబ్ధుర్ రెహ్మాన్ తెలిపారు. పర్యాటకులతో కూడిన ఈ హౌస్ బోట్ బోల్తా పడడంతో విషాదచాయలు అలుముకున్నాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు.
Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 7, 2023
ఘటన జరిగిన సమయంలో బోటులో 40 మంది వరకు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తువల్తిరామ్ బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బోటును ఒడ్డుకు చేర్చారు. మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..