ఇంట్లోని ఓ మూలనున్న ట్రంక్ పెట్టెలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు లభించటం కలకలం రేపింది. సొంత ఇంటి ట్రంక్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు లభ్యమైన మిస్టరీ ఘటన చండీగఢ్‌లోని జలంధర్ జిల్లాలో చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలు కనిపించటం లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జలంధర్ జిల్లాలోని కాన్పూర్ గ్రామంలో నివసిస్తున్న వలస కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలలో ముగ్గురు చిన్నారులు, అమృత (9), శక్తి (7), కాంచన (4) మృతదేహాలు ఆదివారం వారి ఇంట్లోని ట్రంక్ పెట్టెలో కనిపించాయి. ఆదివారం పనికెళ్లేన తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు మక్సుదాన్ పోలీస్ స్టేషన్‌లో చిన్నారిపై ఫిర్యాదు చేశారు.
తొలుత, వారు ఉంటున్న అద్దె ఇంటి యజమానిపై అంతా అనుమానం వ్యక్తం చేశారు. ఇంటి యజమాని మద్యం తాగేవాడని, తరచూ బాలికల తండ్రితో వాగ్వాదానికి దిగేవాడని ఆరోపించారు. ఈ క్రమంలోనే అతడు వారిని ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా బాలిక తండ్రిని ఆదేశించాడు. దాంతో ఇల్లు ఖాళీ చేసేందుకు వస్తువులను తరలిస్తుండగా ట్రంక్ పెట్టేలో ముగ్గురు పిల్లల మృతదేహాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు చేపట్టారు. అయితే, పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
ఈ దారుణ ఘటన ఆదివారం జరిగింది. ఆ తర్వాత పోలీసుల విచారణ అనంతరం హత్య కేసుకు సంబంధించి పిల్లల తల్లిదండ్రులను అరెస్టు చేశారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశీల్ మండల్, మిబు బంధీలకు మొత్తం ఐదుగురు పిల్లలు. అతను తన చివరి కుమార్తెను, 2 సంవత్సరాల కొడుకును పని చేసే స్థలానికి తీసుకువెళ్లాడు. మిగిలిన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. ట్రంకు పెట్టెలో నింపి ఇంటి వెనుక పడేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
#WATCH | Jalandhar, Punjab: Kartarpur DSP Balbir Singh says, “Three sisters found dead in the trunk of the house. We got the information from Kanpur village about the missing of three sisters around 11 at night… The family is from Bihar and they are migrant labourers…… pic.twitter.com/aOzI9kqqJg
— ANI (@ANI) October 2, 2023
పోలీసుల విచారణలో పిల్లలను తామే హత్య చేసినట్లు దంపతులు అంగీకరించారు. పేదరికం, కారణంగా పిల్లలను పోషించే స్థోమత లేక పిల్లలను చంపేశామని ఈ దంపతులు తెలిపారు. హత్యకు గురైన చిన్నారులు ఆదివారం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో సోదాలు నిర్వహించగా ట్రంక్‌లో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. పోలీసుల విచారణలో స్టెరిలైట్ పాలు ఇచ్చి పిల్లలను చంపేశారని దంపతులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున విషం కలిపిన పాలు ఇచ్చి చంపేసి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే అదృశ్యమైనట్లు కథనం అల్లుకున్నారన్నారని పోలీసులు వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..